News June 1, 2024
చాణక్య X SURVEY: వరంగల్ కాంగ్రెస్‌దే..!
వరంగల్ పార్లమెంట్ స్థానం కాంగ్రెస్‌దే అని చాణక్య X సర్వే అంచనా వేసింది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి కడియం కావ్య పోటీ చేశారు. BJP నుంచి ఆరూరి రమేశ్, BRS నుంచి సుధీర్ కుమార్ పోటీలో ఉన్నారు. కాగా తొలుత కాంగ్రెస్, BJPకి పోటాపోటీ ఉంటుందని చర్చ నడవగా.. తాజాగా విడుదలైన సర్వేలో కాంగ్రెస్‌దే విజయమని అంచనా వేసింది. దీనిపై మీ కామెంట్?
Similar News
News January 15, 2025
రేపు వరంగల్ మార్కెట్ పునఃప్రారంభం
ఐదు రోజుల సుదీర్ఘ విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ గురువారం పున: ప్రారంభం కానుంది. శని, ఆదివారం వారాంతపు యార్డు బంద్, సోమ, మంగళ, బుధవారం సంక్రాంతి సందర్భంగా మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. ఉ. 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.
News January 15, 2025
గూగుల్ మీట్ ద్వారా సమీక్ష నిర్వహించిన మంత్రి కొండా
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా సమర్థవంతంగా కార్యాచరణను అమలు చేయాలని మంత్రి కొండా సురేఖ కలెక్టర్లను ఆదేశించారు. మంత్రి ఈరోజు ఉదయం మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లతో ఢిల్లీ నుంచి గూగుల్ మీట్ ద్వారా సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈనెల 26 నుంచి అమలు చేయనున్న నూతన పథకాలను నిబద్ధతతో అమలు చేసి, ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలని మంత్రి సూచించారు.
News January 15, 2025
ఐనవోలు జాతరకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించిన MLA
ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోసం ఐనవోలు పోలీస్ స్టేషన్లో పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాటి పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసుల పర్యవేక్షణ ఉండాలని సూచించారు.