News April 8, 2025

చింతూరు: ఈ నెల 10న ప్రజాభిప్రాయ సేకరణ

image

ఈ నెల 10న చింతూరు ఐటీడీఏ కార్యాలయంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఐటీడీఏ పీవో అపూర్వ భరత్ మంగళవారం తెలిపారు. పోలవరం ప్రాజెక్టు వల్ల పేజ్ 1bలో ముంపునకు గురవుతున్న గ్రామాల ప్రజా ప్రతినిధులు, గ్రామస్థులు ఈ కార్యక్రమానికి వచ్చి అభిప్రాయాలు తెలపాలన్నారు. నిర్వాసితులు ఆర్‌అండ్‌ఆర్ కాలనీలకు వెళ్లిన తర్వాత జీవనోపాధి, నైపుణ్య శిక్షణకు ఎటువంటి అవకాశాలు కావాలో తెలియజేయాలన్నారు.

Similar News

News December 14, 2025

కొమురవెల్లి: అచ్చమైన జానపదం.. మల్లన్న జాతర సంప్రదాయం

image

కొమురవెల్లి మల్లన్న జాతర తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన అచ్చమైన జానపద జాతర. సంక్రాంతి తర్వాత వచ్చే ఆదివారం బోనాలతో జాతర ప్రారంభమై మూడు నెలలు కొనసాగుతుంది. జాతరకు ముందుగా మల్లన్న కల్యాణోత్సవం నిర్వహిస్తారు. రావిచెట్టు, వరాల బండకు పూజలు చేస్తారు. సంతానం లేని మహిళలు వరాలబండను పూజిస్తే సంతానం కలుగుతుందని విశ్వాసం. మల్లన్నను శివుని అవతారంగా కొలుస్తారు. బోనంలో బెల్లం, బియ్యం సమర్పిస్తారు.

News December 14, 2025

పసుపులో దుంపకుళ్లు తెగులు – నివారణ

image

నీరు నిలిచే, తేమ ఎక్కువగా ఉన్న నేలల్లో పసుపు పంటకు దుంపకుళ్లు ముప్పు ఎక్కువ. దీని వల్ల కాండంపై గోధుమ రంగు మచ్చలు కనిపిస్తాయి. దుంప చూస్తే వేర్లు కుళ్లి నల్లగా మారి, లోపల చిన్న పురుగులు ఉండి, దుర్వాసన వస్తుంది. దీని నివారణకు ఎకరాకు 100kgల వేపపిండి వేయాలి. తల్లి పురుగుల కట్టడికి 3g కార్బోఫ్యూరాన్ గుళికలు ఎకరాకు 10kgలు వేయాలి. కుళ్లినచోట లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా. కలిపిన ద్రావణం పోయాలి.

News December 14, 2025

సంగారెడ్డి జిల్లాలో 9 AM @ 24.66 శాతం పోలింగ్

image

సంగారెడ్డి జిల్లాలోని 10 మండలాల్లో ఆదివారం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ఉ.9 గంటల వరకు పోలింగ్‌ శాతాన్ని అధికారులు ప్రకటించారు. మొత్తం 2,99,578 ఓట్లకు గాను 73,871 ఓట్లు పోలయ్యాయి. 24.66 శాతం ఓటింగ్‌ నమోదైనట్లు కలెక్టర్‌ ప్రావీణ్య తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.