News March 15, 2025
చిట్యాల: యువకుడికి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు

తల్లిదండ్రుల కష్టాన్ని చూసి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని లక్ష్యం నిర్దేశించుకున్న అజయ్ ఏకంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. చిట్యాల మండలం తిరుమలపూర్ గ్రామానికి చెందిన నల్ల అజయ్ 2018లో కానిస్టేబుల్, 2024లో గ్రూప్-4, 2025లో ఏకంగా గ్రూప్-2లో స్టేట్ 43, గ్రూప్-3లో 26 ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం అజయ్ రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో విధులు నిర్వహిస్తున్నాడు.
Similar News
News March 15, 2025
తణుకు: పారిశుద్ధ్య కార్మికులతో సీఎం చంద్రబాబు ఫొటో

తణుకు పట్టణంలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. చెత్త నుంచి సంపద సృష్టించి, స్వచ్ఛాంధ్ర కల సాకారం చేసుకోవడానికి ప్రజలంతా సహకరించాలని కోరారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ఆయన పరిసరాలను పరిశుభ్రం చేసి వారితో కలిసి ఫోటో దిగారు. ఈ పిక్‌ను టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాయి.
News March 15, 2025
కడెం: గ్రూప్-3 ఫలితాల్లో మెరిసిన తండా యువకుడు

గ్రూప్-3 ఫలితాల్లో కడెం మండలంలోని చిన్న బెల్లాల్ తండాకు చెందిన భుక్యా శశికుమార్ ప్రతిభ కనబరిచాడు. 306 మార్కులు సాధించి ఎస్టీ కోటాలో రాష్ట్రస్థాయి ఫస్ట్ ర్యాంక్, జనరల్ కోటాలో 58వ ర్యాంకు సాధించాడు. నిరుపేద కుటుంబానికి చెందిన యమున-కిషన్ దంపతుల కుమారుడు శశికుమార్ గ్రూప్-1 సాధించడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు. గ్రూప్-3లో ప్రతిభ కనబరిచిన శశి కుమార్‌ను కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అభినందించారు.
News March 15, 2025
మెదక్: యువకుడు ఊరేసుకుని ఆత్మహత్య

యువకుడు ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మెదక్ పట్టణం బారా ఇమాంలో శనివారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాలు.. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్‌కు చెందిన అరవింద్ (26) ఫతేనగర్‌లో ఉంటూ ఆర్టీసీలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మెదక్ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.