News November 12, 2024

చిత్తూరు: 14 నుంచి ఇంటి వద్దనే క్యాన్సర్ పరీక్షలు

image

చిత్తూరు జిల్లాలో ఈనెల 14 నుంచి ఇంటి వద్దనే క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్‌లో కాన్ఫరెన్స్ ద్వారా వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. 18 సంవత్సరాలు నిండిన వారందరికీ బీపీ, షుగర్, గుండె, థైరాయిడ్, పెరాలసిస్, క్యాన్సర్ వ్యాధులకు నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ముందుగానే వ్యాధులు గుర్తిస్తే చికిత్స చేయడం సులభతరం అవుతుందన్నారు.

Similar News

News November 14, 2024

తిరుమల శ్రీవారికి భారీ బంగారు కానుక

image

తిరుమల శ్రీవారికి ఓ భక్తురాలు భారీ బంగారు కానుకను ఇచ్చారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు చేతుల మీదుగా సుమారు రూ.2 కోట్లు విలువైన వజ్రవైడుర్యాలు పొదిగిన స్వర్ణ వైజయంతీ మాలను డీకే ఆదికేశవులు మనవరాలు తేజస్వీ విరాళమిచ్చారు. ఈవైజయంతీ మాలను ఉత్సవమూర్తులకు టీటీడీ అలంకరించనుంది. తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారికి కూడా మరో వైజయంతీ మాలను రేపు విరాళం ఇవ్వనున్నట్లు దాత తెలిపారు.

News November 14, 2024

తిరుపతి వద్ద ఘోర ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

image

తిరుపతి రూరల్ (మం) వేదాంతపురం నేషనల్ హైవేపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బంధువుల గృహ ప్రవేశం కోసం బెంగళూరు నుంచి కారులో వస్తుండగా వారిని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో తిరుపతి రుయాకు తరలించగా, పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News November 14, 2024

చిత్తూరు: జీవిత ఖైదు కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు

image

చిత్తూరు మాజీ MLA CK.బాబుపై జరిగిన హత్యాయత్నం కేసులో ప్రధాన నిందితుడు చంద్రశేఖర్ అలియాస్ చింటూకు జిల్లా కోర్టు విధించిన జీవిత ఖైదు శిక్షను కొట్టేస్తూ రాష్ట్ర హైకోర్టు బుధవారం తీర్పునిచ్చింది. 2005 డిసెంబర్ 31న సీకే బాబు ఇంటి వద్ద మందు పాత్ర పేలింది. ఇందులో ఒకరు చనిపోగా, పలువురు గాయపడ్డారు. దీనికి సంబంధించిన కేసులో 2018లో చింటూను దోషిగా తేలుస్తూ జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది.