News December 31, 2024

చిత్తూరు: ఆ ఇద్దరు MROలు సస్పెండ్

image

చిత్తూరులో నిన్న రాత్రి తనపై ఇద్దరు ఎమ్మార్వోలు దాడి చేశారని రియల్ ఎస్టేట్ వ్యాపారి కృష్ణ కుమార్ ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ స్పందించారు. దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్దపంజాణి, గంగవరం ఎమ్మార్వోలు ప్రసన్న, శివను సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు విడుదలయ్యాయి.

Similar News

News January 5, 2025

చిత్తూరు: రేపు PGRS రద్దు

image

జిల్లాలో ఈనెల 6 న సోమవారం జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఈ నెల 6,7 వ తేదీలలో సీఎం చంద్రబాబు పర్యటనలో అధికారులందరూ నిమగ్నమై ఉన్నందున రద్దు చేస్తున్నట్లు చెప్పారు. ఈ విషయం జిల్లా ప్రజలు గమనించాలని కోరారు.

News January 5, 2025

వరదయ్యపాలెం: కరెంట్ బిల్లు రూ.47 వేలు

image

వరదయ్యపాలెం మండలం కోవూరుపాడుకు చెందిన మారెయ్య తన ఇంటికి వచ్చిన కరెంటు బిల్లు చూసి కంగుతిన్నాడు. జనవరి నెలలో కరెంట్ బిల్లు రూ.47,932 రావడంతో నోరు వెల్లబెట్టాడు. గత నెలలో రూ. 830 బిల్లు వచ్చినట్లు తెలిపారు. ప్రతినెలా క్రమం తప్పకుండా బిల్లు చెల్లిస్తున్నట్లు చెప్పారు. దీంతో బాధితుడు వరదయ్యపాలెం విద్యుత్ శాఖ కార్యాలయ అధికారులను ఆశ్రయించాడు.

News January 5, 2025

కుప్పం: రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య

image

చెన్నై-బెంగళూరు రైల్వే మార్గంలోని కుప్పం మండలం గుల్లెపల్లి సమీపంలో శనివారం గుర్తు తెలియని యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి వివరాలు ఎవరికైనా తెలిస్తే కుప్పం రైల్వే పోలీసులను సంప్రదించాలని పోలీసులు పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ఏరియా ఆసుపత్రికి తరలించారు.