News April 18, 2025
చిత్తూరు: ఒకటవ తరగతికి ఆన్‌లైన్ అడ్మిషన్లు

ఉచిత నిర్భంద విద్యా హక్కు చట్టం ప్రకారం ఒకటో తరగతిలో అడ్మిషన్లకు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలని చిత్తూరు డీఈవో వరలక్ష్మి సూచించారు. 2025-26 విద్యాసంవత్సరంలో ఒకటో తరగతి అడ్మిషన్లకు ప్రైవేట్, అన్ఎయిడెడ్ పాఠశాలల్లో ఐబీ, ఐసీఎస్ఈ, సీబీఎస్ఈ, స్టేట్ సిలబస్ అమలు చేయాలన్నారు. ఈనెల 28వ తేదీ నుంచి మే 15వ తేదీలోపు www.cre.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలన్నారు.
Similar News
News April 20, 2025
సదుం: అధికారుల తీరుతో విసిగి ACBకి ఫిర్యాదు

రెవెన్యూ అధికారుల తీరుతో విసిగి ఏసీబీకి ఫిర్యాదు చేసినట్లు బాధిత రైతు షఫీ ఉల్లా తెలిపారు. తనకు సంబంధించిన 5.60 ఎకరాల సెటిల్మెంట్ భూమిని అధికారులు అసైన్మెంట్‌గా మార్పు చేశారని.. తిరిగి దానిని సెటిల్మెంట్‌గా నమోదు చేసేందుకు రూ.1.50 లక్షల నగదును డిమాండ్ చేశారని ఆయన వాపోయారు. దానిని చెల్లించేందుకు ఇష్టం లేకనే ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చి తాహశీల్దార్, వీఆర్ఓలను పట్టించినట్లు చెప్పారు.
News April 20, 2025
చిత్తూరు: రైలు నుంచి పడి డిగ్రీ విద్యార్థి మృతి

గంగాధరనెల్లూరు మండలం నల్లరాళ్ళపల్లికి చెందిన హేమాద్రి ఆచారి కుమారుడు ప్రవీణ్ కుమార్ శనివారం రైలు నుంచి పడి అక్కడికక్కడే మృతి చెందాడు. తిరుపతి నుంచి చిత్తూరుకు వస్తున్న ప్యాసింజర్ రైలులో పూతలపట్టు సమీపంలోని ముత్తురేవులు వద్ద జారిపడి మృతి చెందాడు. తండ్రి సైతం జనవరిలో గుండెపోటుతో మృతి చెందాడు. ఈ సమాచారం తెలుసుకున్న జీడీ నెల్లూరు గ్రామంలో, కుటుంబంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి.
News April 20, 2025
DSC: చిత్తూరు జిల్లాలో 1,473 పోస్టుల భర్తీ

డీఎస్సీ-2025 ద్వారా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1,473 టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నారు.
➤ స్కూలు అసిస్టెంట్ లాంగ్వేజ్-1:38
➤ హిందీ:17 ➤ ఇంగ్లిష్: 104
➤ గణితం: 30 ➤ఫిజిక్స్: 29
➤ జీవశాస్త్రం: 63 ➤ సోషల్: 130
➤ పీఈటీ: 86 ➤ఎస్జీటీ: 976
NOTE: ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలల్లో మ్యాథ్స్ 1, ఫిజిక్స్ 1, జీవశాస్త్రం 1, ఎస్టీటీ 2 పోస్టులు భర్తీ కాబోతున్నాయి.