News September 12, 2024

చిత్తూరు జిల్లా నేతలతో జగన్ సమాలోచనలు

image

ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ నేతలు ఇవాళ తాడేపల్లిలో మాజీ సీఎం జగన్‌ను కలిశారు. మాజీ మంత్రులు పెద్దిరెడ్డి, రోజా, నారాయణ స్వామి, ఎంపీ మిథున్ రెడ్డి తదితరులు జిల్లాలోని పరిస్థితులను మాజీ సీఎంకు వివరించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై గట్టిగా పోరాడాలని జగన్ సూచించారు. ఎమ్మెల్సీలు భరత్, సిపాయి సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు జగన్‌ను కలిసిన వారిలో ఉన్నారు.

Similar News

News December 22, 2024

మదనపల్లె: డిగ్రీ పరీక్షల్లో యథేచ్ఛగా మాస్ కాపీ 

image

SVU పరిధిలో జరుగుతున్న డిగ్రీ పరీక్షల్లో యథ్చేచ్చగా మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. మదనపల్లెలో కొన్ని కాలేజీలలో యాజమాన్యాలు సీపీ కెమెరాలు ఆఫ్ చేయించి మరీ పరీక్షలు రాయిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. దీనిపై SVU పరీక్షల నియంత్రణ అధికారి కిశోర్‌ను వివరణ కోరగా.. ఈ అంశం తమ దృష్టికి రాలేదన్నారు. విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. 

News December 22, 2024

చిత్తూరు: తండ్రే హత్య చేయించాడు.?

image

పుంగనూరు(M) లక్ష్మీపురం అటవీ ప్రాంతంలో శనివారం ఓ వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుడిని మదనపల్లె(M) గుంపులపల్లె సోమశేఖర్‌రెడ్డి(36)గా పోలీసులు గుర్తించారు. తాగుడుకు బానిసై కుటుుబీకులను వేధిస్తుండటంతో అతడి తండ్రే సుపారి ఇచ్చి హత్య చేయించినట్లుగా గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేశారు. నిందితుల మధ్య డబ్బు కోసం గొడవ జరగ్గా ఈ విషయం బయటికి పొక్కినట్లు తెలుస్తోంది. సీఐ శ్రీనివాస్ కేసు నమోదు చేశారు.

News December 22, 2024

చిత్తూరు: నేటి నుంచి టీచర్లకు కౌన్సెలింగ్

image

చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని మున్సిపల్, కార్పొరేషన్ పాఠశాలల్లో పనిచేస్తున్న పలు కేడర్ టీచర్లకు నేడు, రేపు (ఆది, సోమవారం) ప్రమోషన్ల కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు DEO వరలక్ష్మి తెలిపారు. స్కూల్ అసిస్టెంట్లకు HMగా, ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతి కల్పించనున్నట్లు తెలిపారు. సీనియార్టీ జాబితాను ఇప్పటికే ఎంఈఓలకు పంపామన్నారు.