News March 2, 2025
చిత్తూరు జిల్లాలో 96% పింఛన్ల పంపిణీ

చిత్తూరు జిల్లాలో శనివారం ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అధికారులు 96 శాతం పంపిణీ చేశారు. 2,64,899 మంది లబ్ధిదారులకుగాను 2,54,375 మందికి (96.03) పంపిణీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. జీడి నెల్లూరులో జరిగిన పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్న విషయం తెలిసిందే.
Similar News
News March 3, 2025
చిత్తూరు: ఇంటర్ సెకండియర్ పరీక్షలకు 609 మంది గైర్హాజరు

చిత్తూరు జిల్లాలో ఇంటర్ సెకండియర్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించినట్లు DIEO సయ్యద్ మౌలా తెలిపారు. తొలి రోజు సోమవారం తెలుగు, హిందీ, సంస్కృతం, ఉర్దూ పరీక్షలకు మొత్తం 12,220 మందికి గాను 11,711 మంది విద్యార్థులు హాజరుకాగా, 509 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్టు తెలిపారు. ఒకేషనల్ పరీక్షకు 1,809 మందికి గాను 1,709 మంది విద్యార్థులు హాజరు కాగా, 100 మంది విద్యార్థులు గైర్హాజరైనట్టు తెలిపారు.
News March 3, 2025
కుప్పం : చికెన్ పట్ల అపోహలు వద్దు : ఎమ్మెల్సీ

చికెన్ పట్ల సామాజిక మాధ్యమంలో వస్తున్న అపోహలను నమ్మొద్దని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పేర్కొన్నారు. కుప్పం టీడీపీ కార్యాలయ సమీపంలో ఆదివారం సాయంత్రం చికెన్ మేళా కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం ప్రారంభించారు. చికెన్, కోడిగుడ్లలో మంచి ప్రోటీన్లు దొరుకుతుందని, అపోహలను పక్కనపెట్టి చికెన్ తినొచ్చని అన్నారు.
News March 3, 2025
చిత్తూరు: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ యువకుడు మృతి

శాంతిపురం (M) మఠం వద్ద శనివారం బైకుపై లారీ దూసుకెళ్లిన ప్రమాదంలో <<15621064>>మృతుల సంఖ్య మూడుకు<<>> చేరింది. బైరెడ్డిపల్లె (M) మూగనపల్లికి చెందిన తల్లి కొడుకు తులసమ్మ, రవితేజ అక్కడికక్కడే మృతి చెందగా మరో కొడుకు పవన్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. పవన్ కుమార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. రోడ్డు ప్రమాదంలో తల్లి, ఇద్దరు కొడుకులు మృతి చెందడంతో మూగనపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.