News March 26, 2025
చిత్తూరు జిల్లాలో భయపెడుతున్న భానుడు

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. ఉ.11కే భానుడు దాదాపు 40 డిగ్రీల ఉష్ణోగ్రతలతో ఠారెత్తిస్తున్నాడు. మంగళవారం తవణంపల్లెలో దాదాపు 40, గంగవరంలో 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చిత్తూరులో 38, నగరిలో 37, పలమనేరులో 37.5, కుప్పంలో 33.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మీ ప్రాంతంలో కూడా ఇలానే ఉంటే కామెంట్ చేయండి.
Similar News
News April 1, 2025
వి.కోట : రోడ్డు ప్రమాదంలో టీచర్ మృతి

వి.కోట – పలమనేరు ప్రధాన రహదారిలో రాఘవపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి వ్యక్తి మృతి చెందాడు. అతను రామకుప్పం మండలం కంచిదాసనపల్లెలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గురుమూర్తిగా సమాచారం. మంగళవారం ఉదయం రాగువపల్లి వద్ద రోడ్డు ప్రమాదానికి గురవ్వగా.. స్థానికులు వి.కోట ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అక్కడ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
News April 1, 2025
చిత్తూరు: నేడు తెరచుకోనున్న బడులు

చిత్తూరు జిల్లాలో నిర్ణయించుకున్న స్థానిక ఐచ్చిక సెలవులు పూర్తిగా వాడుకున్నారని డీఈవో వరలక్ష్మి తెలిపారు. దీంతో మంగళవారం జిల్లావ్యాప్తంగా అన్ని పాఠశాలల యాజమాన్యాలకు ఎలాంటి సెలవు లేదన్నారు. బడులు యథావిధిగా పనిచేస్తాయని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు తప్పక విధులకు హాజరు కావాలన్నారు. అలాగే టెన్త్ పరీక్ష యథావిధిగా జరుగుతుందని స్పష్టం చేశారు.
News April 1, 2025
నేడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ: కలెక్టర్

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారుల ఇంటి వద్దకే పంపిణీ జరుగుతుందని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. పెన్షన్లు మంగళవారం ఉదయం 7 గంటల నుంచి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని, అందుకు సంబంధించిన అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో 2,65,067 మంది పెన్షన్ దారులకు రూ.112.79 కోట్లు పెన్షన్లు పంపిణీ చేయునట్లు తెలిపారు.