News April 25, 2024
చిత్తూరు: డిప్యూటీ మేయర్‌పై కేసు నమోదు

కర్ణాటక మద్యాన్ని అక్రమంగా నిల్వ చేసిన కేసులో చిత్తూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ రాజేశ్ కుమార్ రెడ్డిపై కేసు నమోదైంది. కొంగారెడ్డి పల్లెలోని డిప్యూటీ మేయర్ రాజేశ్ కుమార్ రెడ్డికి చెందిన కారు షెడ్డులో నిల్వ ఉంచిన కర్ణాటక మద్యాన్ని ఈ నెల 18న ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు పోలీసులతో కలిసి పట్టుకున్నారు. దీనిపై కేసు నమోదు చేశామని ఎంసీసీ అధికారులు ప్రకటించారు.
Similar News
News April 24, 2025
చిత్తూరు: ఒకేసారి తండ్రి, కుమార్తె పాస్

చిత్తూరు జిల్లా రొంపిచర్ల పంచాయతీ పాలెం వీధికి చెందిన తండ్రి, కుమార్తె ఒకేసారి పదో తరగతి పరీక్షలు రాసి పాసయ్యారు. 1995-96లో 10వ తరగతి పరీక్షలు రాసిన బి.షబ్బీర్ ఫెయిలయ్యారు. అప్పట్లో ప్రమాదవశాత్తు గాయపడి దివ్యాంగుడిగా మారారు. ఏదైనా ఉద్యోగం సాధించాలనే తపనతో తన కుమార్తె బి.సమీనాతో కలిసి పదో తరగతి పరీక్షలు రాశారు. షబ్బీర్‌కు 319, కుమార్తె సమీనాకు 309 మార్కులు రావడం విశేషం.
News April 23, 2025
రొంపిచర్ల: పదో తరగతి ఒకేసారి పాసైన తండ్రి, కూతురు

రొంపిచర్ల గ్రామపంచాయతీ పాలెం వీధికి చెందిన తండ్రి, కూతురు పదో తరగతి పరీక్షలు రాసి ఒకే సారి పాసైన సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 1995-96 సంవత్సరంలో 10 పరీక్షలు రాసిన బి.షబ్బీర్ ఫెయిల్ అయ్యారు. అప్పట్లో ప్రమాదవశాత్తు గాయపడి దివ్యాంగుడిగా మారాడు. ఏదైనా ఉద్యోగం సాధించాలని కుమార్తెతో పాటు పదో తరగతి పరీక్షలు రాశాడు. తండ్రి బి.షబ్బీర్‌కు 319 మార్కులు, కుమార్తె బి.సమీనాకు 309 మార్కులు వచ్చాయి.
News April 23, 2025
టెన్త్ ఫలితాలు: 6 నుంచి 24వ స్థానానికి చిత్తూరు జిల్లా

ఈ ఏడాది 10వ తరగతి ఫలితాల్లో చిత్తూరు జిల్లాలో ఉత్తీర్ణత శాతం తీవ్ర నిరాశకు గురి చేసింది. గతేడాది టెన్త్ ఫలితాల్లో చిత్తూరు జిల్లా 91.28% ఉత్తీర్ణతతో 6వ స్థానంలో నిలవగా, ఈ ఏడాది 67.06 శాతంతో 24వ స్థానంలో నిలిచింది. ఏడాది వ్యవధిలో దాదాపు 18 స్థానాలు దిగజారడంపై పలువురు అసహనం వ్యక్తం చేశారు.