News May 23, 2024

చిత్తూరు: నేటి నుంచి ఏనుగుల లెక్కింపు

image

చిత్తూరు జిల్లాలోని అటవీ ప్రాంతంలో గురువారం నుంచి ఏనుగుల గణన చేపట్టనున్నారు. చిత్తూరు తూర్పు, పశ్చిమ, కార్వేటినగరం, పలమనేరు, పుంగనూరు, కుప్పం రేంజ్ల పరిధిలోని బీట్లలో అధికారులు, సిబ్బంది ఇందులో పాల్గొననున్నారు. మొత్తం మూడురోజులు కొనసాగనుంది. మొదటిరోజు 15 కి.మీ. అడవిలో ఏనుగుల అడుగుజాడలు, మలమూత్ర విసర్జన ఆధారంగా వాటి సంఖ్య లెక్కిస్తారు.

Similar News

News September 29, 2024

SVU : LLB ఫలితాలు విడుదల

image

శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది జూన్ నెలలో 3/ 5 LLB ( NON – CBCS) 6, 9 సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు ఆదివారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్ష విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను http://www.manabadi.co.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

News September 29, 2024

చిత్తూరు: జిల్లా ప్రజలకు గమనిక.

image

అక్టోబర్ నెలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లు లబ్ధి దారుల ఇంటి వద్దకే సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ ల పంపిణీ జరుగుతుందని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లాలో 2,69,677 మందికి సుమారు రూ.113.77 కోట్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.అక్టోబర్ 1వ, 3వ తేదీలలో మాత్రమే పంపిణీ చేయడం జరుగుతుందని,అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి సందర్భంగా సెలవు దినంతో 3 వ తేదీ పంపిణీ చేస్తామని చెప్పారు.

News September 29, 2024

శ్రీవారి సేవకు రూ.కోటి టికెట్

image

కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడిని దర్శించుకోవాలనుకునే భక్తులెందరో ఉన్నారు. అలావచ్చే భక్తులు శ్రీవారిని కళ్లారా చూడ్డానికి ఎన్నోరకాల ఆర్జితసేవలు ఉన్నాయి. వాటిల్లో ప్రత్యేకమైన సేవ ఒకటి ఉంది. అదే శ్రీవారి ఉదయాస్తమానసేవ. ఈసేవ టికెట్ ధర అక్షరాల రూ.కోటి. ఈటికెట్ కొనుగోలుచేసిన భక్తులు ఆరోజును బట్టి సుప్రభాతం, తోమాల, అర్చన, అభిషేకం అష్టదళపాదపద్మారాధన ఉంటుంది. వివరాలకు TTD వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.