News April 3, 2025

చిత్తూరు: నేటి నుంచి ప్రత్యేక ఆధార్ క్యాంపులు

image

చిత్తూరు జిల్లావ్యాప్తంగా ఈనెల 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఆధార్ స్పెషల్ క్యాంపులను నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆరేళ్ల లోపు పిల్లలకు, ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూపులకు ఆధార్ నమోదు ప్రక్రియ చేపట్టనున్నట్లు చెప్పారు. ఎంపిక చేసిన గ్రామ, వార్డు సచివాలయాల్లో స్పెషల్ క్యాంపులు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఈనెల 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు మరో విడత క్యాంపులు నిర్వహించనున్నారు.

Similar News

News April 5, 2025

ప్రమాదకరంగా చిత్తూరు-పుత్తూరు రోడ్డు

image

చిత్తూరు-పుత్తూరు జాతీయ రహదారి ప్రమాదకరంగా ఉంది. ఎక్కడబడితే అక్కడ గుంతలు తీసి మట్టిని రోడ్డుపై వేయడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. రాత్రివేళల్లో ఈ మార్గంలో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

News April 4, 2025

చిత్తూరు: 11 లోపు అభ్యంతరాలు చెప్పండి

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని జడ్పీ, మున్సిపాలిటీ, నగరపాలక పాఠశాలల్లో పనిచేస్తున్న ఎస్జీటీ/లాంగ్వేజ్ పండిట్స్/పీఈటీల స్కూల్ అసిస్టెంట్ పదోన్నతుల సీనియార్టీ జాబితాను డీఈవో వెబ్‌సైట్‌లో పెట్టారు. ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 5వ తేదీ నుంచి 11వ తేదీ లోపు తన కార్యాలయంలో తగిన ఆధారాలతో సమర్పించాలని డీఈవో వరలక్ష్మి చెప్పారు. ఆ తర్వాత అభ్యంతరాలు తీసుకోబోమని స్పష్టం చేశారు.

News April 4, 2025

చిత్తూరు జిల్లాలో రూ.150 కోట్లతో ఉపాధి పనులు

image

చిత్తూరు జిల్లాలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ కింద రూ.150 కోట్లతో మెటీరీయల్ కాంపొనెంట్ పనులను చేపట్టనున్నామని కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడించారు. జిల్లా సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. అభివృద్ధి పనుల మంజూరులో MLA, MLC అభ్యర్థనలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు.

error: Content is protected !!