News April 3, 2025

చిత్తూరు: నేటి నుంచి స్పాట్ వాల్యుయేషన్

image

చిత్తూరు జిల్లా కేంద్రంలోని పీసీఆర్ ప్రభుత్వ పాఠశాలలో గురువారం నుంచి టెన్త్ మూల్యాంకనం జరగనున్నట్లు డీఈవో వరలక్ష్మి తెలిపారు. 10వ తేదీ వరకు స్పాట్ వాల్యుయేషన్ కొనసాగుతుంది.  1,244 మంది టీచర్లకు ఈ బాధ్యత అప్పగించారు. ప్రతి టీచర్ తప్పనిసరిగా మూల్యాంకన విధులకు హాజరు కావాలన్నారు. పేపర్లు కరెక్షన్ చేసే సమయంలో సెల్‌ఫోన్ వాడరాదని స్పష్టం చేశారు.

Similar News

News April 4, 2025

చిత్తూరు: 11 లోపు అభ్యంతరాలు చెప్పండి

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని జడ్పీ, మున్సిపాలిటీ, నగరపాలక పాఠశాలల్లో పనిచేస్తున్న ఎస్జీటీ/లాంగ్వేజ్ పండిట్స్/పీఈటీల స్కూల్ అసిస్టెంట్ పదోన్నతుల సీనియార్టీ జాబితాను డీఈవో వెబ్‌సైట్‌లో పెట్టారు. ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 5వ తేదీ నుంచి 11వ తేదీ లోపు తన కార్యాలయంలో తగిన ఆధారాలతో సమర్పించాలని డీఈవో వరలక్ష్మి చెప్పారు. ఆ తర్వాత అభ్యంతరాలు తీసుకోబోమని స్పష్టం చేశారు.

News April 4, 2025

చిత్తూరు జిల్లాలో రూ.150 కోట్లతో ఉపాధి పనులు

image

చిత్తూరు జిల్లాలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ కింద రూ.150 కోట్లతో మెటీరీయల్ కాంపొనెంట్ పనులను చేపట్టనున్నామని కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడించారు. జిల్లా సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. అభివృద్ధి పనుల మంజూరులో MLA, MLC అభ్యర్థనలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు.

News April 4, 2025

చిత్తూరు జిల్లాలో ప్రత్యేక అధికారుల నియామకం

image

వైద్య ఆరోగ్య శాఖలో వివిధ ఆరోగ్య కార్యక్రమాల పర్యవేక్షణ నిమిత్తం డివిజన్‌కు ఒక్కో అధికారిని నియమిస్తూ చిత్తూరు డీఎంహెచ్ఓ సుధారాణి ఉత్తర్వులు జారీ చేశారు. జీడీ నెల్లూరు డివిజన్‌కు డీఐఓ హనుమంతరావు, పలమనేరుకు టీబీ అధికారి వెంకటప్రసాద్, కుప్పంకు గంగాదేవి, చిత్తూరుకు అనుష, నగరికి నవీన్ తేజ్, పూతలపట్టుకు గిరి, పుంగనూరుకు అనిల్ కుమార్‌ను నియమించారు.

error: Content is protected !!