News January 26, 2025
చిత్తూరు: పెళ్లి పేరుతో వంచన
ప్రేమ పేరుతో మోసం చేసిన యువకుడిపై పొక్సో కేసు నమోదైన ఘటన అన్నమయ్య జిల్లాలో వెలుగు చూసింది. కలికిరి సీఐ రెడ్డి శేఖరరెడ్డి వివరాల మేరకు.. చిత్తూరు జిల్లా రొంపిచర్లకు చెందిన యువతి కలికిరి మండలంలోని అమ్మమ్మ ఇంట్లో ఉంటూ వాయల్పాడులో ఇంటర్ చదువుతోంది. ఈక్రమంలో అమ్మమ్మ ఊరిలోని జునైద్ అహమ్మద్‌తో ప్రేమలో పడింది. పెళ్లి చేసుకుంటానని వంచించాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదైంది.
Similar News
News January 27, 2025
చిత్తూరు: ఇంటి నిర్మాణానికి దరఖాస్తు చేసుకోండి
చిత్తూరు నగరపాలక పరిధిలో సొంత ఇంటి స్థలం కలిగి ఉండి ఇంటి నిర్మాణానికి ఆసక్తిగల అభ్యర్థులు ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకం కింద దరఖాస్తు చేసుకోవాలని నగరపాలక కమిషనర్ నరసింహ ప్రసాద్ తెలిపారు. రూ.2.50 లక్షలు బ్యాంకు ద్వారా సబ్సిడీ రుణం అందిస్తామన్నారు. ఆసక్తిగలవారు వార్డ్ పరిధిలోని సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు వార్డ్ అమినిటి కార్యదర్శిని కలవాలన్నారు.
News January 26, 2025
చిత్తూరులో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
చిత్తూరు నగరం మురుకంబట్టు సమీపంలో ఓ ప్రైవేటు కళాశాలలో విద్యార్థిని ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. బిహార్‌కు చెందిన విద్యార్థిని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ చదువుతుంది. దీంతో ఆదివారం ఉరేసుకుని మృతి చెందిందని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News January 26, 2025
బంగారుపాలె: లోయలోకి దూసుకెళ్లిన లారీ
బంగారుపాలెం మండలం మొగిలి ఘాట్ వద్ద కాసేపటి క్రితం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కంటైనర్ అదుపుతప్పి లోయలోకి దూసుకుపోవడంతో ఒకరు మృతి చెందారు. బెంగళూర్ నుంచి చిత్తూరు వైపు వస్తున్న కంటైనర్ అతివేగంగా రావడంతో అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందగా డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.