News September 7, 2024

చిత్తూరు: మీరు చూపించిన సేవా భావం అందరికీ ఆదర్శం: SP

image

హెడ్ కానిస్టేబుల్ చూపించిన సేవాభావం అందరికీ ఆదర్శమని చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. శుక్రవారం ఎస్బీ హెడ్ కానిస్టేబుల్ మురళీకృష్ణ వరద బాధితులకు రూ.25,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఆర్థిక సహాయాన్ని ఎస్పీకి అందజేయడంతో హెడ్ కానిస్టేబుల్‌ను అభినందించారు.

Similar News

News December 30, 2024

2024 రౌండప్.. చిత్తూరు జిల్లాలో 389 మంది మృతి

image

చిత్తూరు జిల్లాలో 2023తో పోలిస్తే 2024లో రోడ్డు ప్రమాదాలు పెరిగినట్లు అధికారులు తెలిపారు. 2023లో 703 ప్రమాదాలు సంభవించి 351 మంది మృతి చెందగా.. 2024లో 734 ప్రమాదాలు జరిగి 389 మంది మృత్యువాత పడ్డారు. అదేవిధంగా 2023లో సైబర్ కేసులు 58 నమోదవ్వగా.. 2024లో 41 కేసులు నమోదయ్యాయి. హత్యలు 44 జరగగా.. 2024లో 24 జరిగాయి. గతంలో 427 దొంగతనాలు జరగగా, 2024లో 323 జరిగినట్లు అధికారులు తెలిపారు.

News December 30, 2024

తిరుపతి: ఆనాటి గ్రీటింగ్ కార్డ్స్ ఇప్పుడు ఎక్కడ..?

image

చిత్తూరు జిల్లాలో కొత్త సంవత్సరం అంటే అందరూ తిరుమల, తిరుచానూరు, కాణిపాకం అంటూ తమకు నచ్చిన గుడికి వెళ్తుంటారు. ఆ తర్వాత ఆత్మీయుల కోసం గ్రీటింగ్ కార్డు కొనుగోలు చేసి మనసులోని భావాలను ఆ కార్డుపై రాసి పంపేవారు. నేడు పరిస్థితి మారింది. గుడికి వెళ్లడం కొనసాగుతున్నా.. గ్రీటింగ్ కార్డులు మాయమయ్యాయి. మొబైల్ ఫోన్ల రాకతో అర్ధరాత్రి 12 మోగగానే మెసేజ్‌లు, కాల్స్‌తో విషెస్ చెబుతున్నారు.

News December 30, 2024

CTR: రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. భార్య పరిస్థితి విషమం

image

మదనపల్లె బైపాస్‌లోని రాయల్ ఉడ్ వద్ద ఆదివారం రాత్రి ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కారు టైర్ పంచర్ కావడంతో బైకు, బంకు, చెట్టును ఢీకొట్టింది. గాయాలపాలైన దంపతుల్ని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భర్త మృతి చెందాడు. భార్య కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. మృతుడు పలమనేరు దాసర్లపల్లికి చెందిన గంగాధర్‌గా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.