News April 10, 2025

చిత్తూరు: ముగిసిన టెన్త్ వ్యాల్యుయేషన్

image

చిత్తూరు పీసీఆర్ పాఠశాలలో ఏడు రోజులుగా సాగిన పదో తరగతి పబ్లిక్ పరీక్షల మూల్యాంకన ప్రక్రియ ముగిసింది. ఇందులో ఎలాంటి అవకతవకలు జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకున్నట్లు డీఈవో వరలక్ష్మి వెల్లడించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన 1,74,808 పదో తరగతి పరీక్షల జవాబుపత్రాలను ఈనెల 9వ తేదీ వరకు దిద్దామన్నారు.

Similar News

News April 18, 2025

చిత్తూరులో రేపు మెగా జాబ్ మేళా

image

చిత్తూరు గ్రీన్ పేటలోని డిగ్రీ కళాశాలలో 19న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు DSDO గుణశేఖర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. 20 ప్రముఖ కంపెనీలలో ఖాళీగా ఉన్న 1,000 పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. టెన్త్ నుంచి ఎంబీఏ వరకు అర్హత కలిగిన అభ్యర్థులు https://naipunyam.ap.gov.in/user-registration వెబ్‌సైట్ ద్వారా రిజిస్టర్ అవ్వాలన్నారు.

News April 18, 2025

చిత్తూరు: పద్మ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

image

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం అందించే పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీలకు అంతర్జాతీయస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ చూపిన క్రీడాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎస్డీవో బాలాజీ తెలిపారు. అర్హులైనవారు ఈనెల 26వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు డీఎస్ఏ కార్యాలయాన్ని సంప్రదించాలని ఓ ప్రకటనలో కోరారు.

News April 18, 2025

చిత్తూరు: ఒకటవ తరగతికి ఆన్‌లైన్ అడ్మిషన్లు

image

ఉచిత నిర్భంద విద్యా హక్కు చట్టం ప్రకారం ఒకటో తరగతిలో అడ్మిషన్లకు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలని చిత్తూరు డీఈవో వరలక్ష్మి సూచించారు. 2025-26 విద్యాసంవత్సరంలో ఒకటో తరగతి అడ్మిషన్లకు ప్రైవేట్, అన్ఎయిడెడ్ పాఠశాలల్లో ఐబీ, ఐసీఎస్ఈ, సీబీఎస్ఈ, స్టేట్ సిలబస్ అమలు చేయాలన్నారు. ఈనెల 28వ తేదీ నుంచి మే 15వ తేదీలోపు www.cre.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలన్నారు.

error: Content is protected !!