News March 25, 2025
చిత్తూరు: మెగా డీఎస్సీకి ఉచిత శిక్షణ

మెగా డీఎస్సీ పరీక్షకు హాజరయ్యే బీసీ, ఈడబ్ల్యూసీ అభ్యర్థులకు ఆన్‌లైన్ ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఇందుకోసం మార్చి 10 నుంచి దరఖాస్తులను బీసీ సంక్షేమ సాధికారిత అధికారి కార్యాలయంలో అందజేయాలని సూచించారు. దరఖాస్తుతోపాటు సంబంధిత సర్టిఫికెట్లను అందజేయాలన్నారు.
Similar News
News March 29, 2025
ఉగాది సుఖసంతోషాలతో గడుపాలి: ఎస్పీ

ఉగాది పర్వదినాన్ని జిల్లా ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఎస్పీ మణికంఠ శనివారం కోరారు. నూతన సంవత్సరంలో అందరికీ ఆరోగ్యం, ఆయుషు, ఆనందం, అభివృద్ధి కలగాలని మనసారా కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారు. ప్రజలకు పోలీసు శాఖ తరపున ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.
News March 29, 2025
చిత్తూరు జిల్లా ప్రథమ స్థానం: కలెక్టర్

చిత్తూరు జిల్లా పాల ఉత్పత్తిలో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శనివారం జిల్లా సచివాలయంలోని సమావేశం మందిరంలో పశుసంవర్ధక శాఖ అధికారులతో, ఎన్‌ఇసిసి సభ్యులతో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని రైతాంగం వ్యవసాయ రంగానికి అనుబంధంగా పాడి పరిశ్రమపై ఎక్కువ మంది రైతులు ఆధారపడి ఉన్నారన్నారు.
News March 29, 2025
మైనర్ బాలికపై అత్యాచారం.. జీవిత ఖైదు

మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ చిత్తూరు ప్రత్యేక పోక్సో కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. గుడిపాల(మ) చిత్తపారకు చెందిన దినేశ్ జ.31 2022వ సం.లో బాలికను పెళ్లి చేసుకుంటానంటూ ఇంటి నుంచి తీసుకెళ్లాడు. కోరిక తీర్చాలంటూ బలవంతపెట్టగా ఆమె ఒప్పుకోలేదు. దీంతో కూల్ డ్రింక్‌లో మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశాడు. నేరం రుజువు కావడంతో జడ్జి శిక్ష ఖరారు చేశారు.