News March 15, 2025
చిత్రాడలోని జనసేన సభపై మీ కామెంట్

పిఠాపురంలోని చిత్రాడలో ‘జనసేన జయకేతం’సభ విజయవంతంగా ముగిసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పీచ్‌తో ఆ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. అయితే తన ప్రసంగంలో స్థానిక అంశాలపై పెద్దగా ఫోకస్ చేయలేదని లోకల్ ప్రజలు అంటున్నారు. హిందీ మన భాష, వైసీపీపై విమర్శలు, నిలిచాం.. టీడీపీని నిలబెట్టాం అంటూ ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి పవన్ చిత్రాడ సభపై మీరెలా ఫీలయ్యారు. కామెంట్ చేయండి..
Similar News
News March 15, 2025
అభివృద్ధికి సహకరిస్తున్న రైతులకు అభినందనలు: కలెక్టర్ ప్రతీక్

ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు భూములను ఇచ్చి సహకరిస్తున్న రైతులకు తగు న్యాయం చేస్తున్నామని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. శనివారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో దుద్యాల మండలం హకీంపేట రైతులకు సర్వే నంబర్ 252లో 55.35 ఎకరాల భూమి ఇచ్చిన 31 మంది రైతులకుఅధికారులతో కలిసి కలెక్టర్ నష్టపరిహార చెక్కులను అందజేశారు. ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పాటు అందించడం అభినందనీయమన్నారు.
News March 15, 2025
భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న సినీ హీరో శ్రీకాంత్

వరంగల్ శ్రీ భద్రకాళి దేవస్థానాన్ని శనివారం ప్రముఖ సినీ హీరో శ్రీకాంత్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శేషు తదితరులున్నారు.-
News March 15, 2025
అనకాపల్లి: 331 మంది విద్యార్థులు గైర్హాజరు

అనకాపల్లి జిల్లాలో శనివారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షకు 331 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సుజాత ఓ ప్రకటనలో తెలిపారు. జనరల్ విద్యార్థులు 9,720 మంది హాజరు కావాల్సి ఉండగా 9,505 మంది హాజరైనట్లు తెలిపారు. ఒకేషనల్ విద్యార్థులు 1,932 మంది హాజరుకావాల్సి ఉండగా 1,816 మంది హాజరైనట్లు తెలిపారు.