News March 19, 2025

చిన్న శ్రీను కుమారుడి మృతి

image

విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్, భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు రెండో కుమారుడు ప్రణీత్ నేడు మృతి చెందారు. 2020లో ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రణీత్ 4 సంవత్సరాల 10 నెలల పాటు మృత్యువుతో పోరాడాడు. చివరకు విశాఖలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుది శ్వాస విడిచారు.

Similar News

News March 19, 2025

ఫ్రిజ్‌లో 12 టన్నుల మేక మాంసం..!

image

హైదరాబాద్‌లోని మంగళ్‌హట్‌లో రూ.8 లక్షలు విలువ చేసే 12 టన్నుల మేక మాంసాన్ని GHMC టాస్క్ ఫోర్స్ సిబ్బంది సీజ్ చేశారు. మహమ్మద్ అఫ్రోజ్ అనే వ్యాపారి తక్కువ ధరకు గొర్రెలు, మేకల మాంసాన్ని కొని ప్రిజ్‌లో భద్రపరుస్తున్నట్లు గుర్తించారు. ఇలా నిల్వచేసిన మాంసాన్ని హోటళ్లు, శుభకార్యాలకు సప్లై చేస్తున్నట్లు తేల్చారు. ఈ ఘటనతో రెస్టారెంట్లలో తినే ముందు ఆలోచించాల్సిందేనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

News March 19, 2025

నాగర్‌కర్నూల్: ప్రభుత్వ ఆస్పత్రిలో ఆధునిక పరికరాలు ప్రారంభం

image

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న గర్భిణుల కోసం మెరుగైన సేవలు అందించేందుకు, సాధారణ ప్రసవాలు చేసేందుకు, అధునాతన హైడ్రాలిక్ టేబుల్స్ వినియోగించేందుకు ఆసుపత్రిలో లేబర్ రూమ్‌లో అధునాత పరికరాలను ప్రారంభించామని సూపరింటెండెంట్ ఆర్.రఘు తెలిపారు. ప్రతి గర్భిణీ ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవం పొందాలని సూచించారు. వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

News March 19, 2025

వాతావరణ మార్పులపై అధికారులతో MHBD కలెక్టర్ సమీక్ష

image

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అద్విత్ కుమార్ సింగ్ అధికారులతో జిల్లాస్థాయి వాతావరణ మార్పుల టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. తీవ్రమైన ఎండల నేపథ్యంలో ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ వడదెబ్బ నుంచి ఎలా చర్యలు తీసుకోవాలనే పూర్తి అవగాహన కార్యక్రమాలు ప్రజలకు అర్థమయ్యే విధంగా అన్ని సాధనాల ద్వారా విస్తృత ప్రచారం కలిగించి ఎండ నివారణ చర్యలు తీసుకోవాలన్నారు.

error: Content is protected !!