News May 6, 2024
చిన్నబొంకూరు కన్నీరు!
ట్రాక్టర్ బోల్తా పడి చిన్నబొంకూర్కు చెందిన బేతి లక్ష్మీ, మల్యాల వైష్ణవి, పోచంపల్లి రాజమ్మ <<13186723>>మృతి చెందిన<<>> విషయం విదితమే. రాజమ్మ భర్త రాజకొమురయ్య మృతి చెందగా.. కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నడిపి కుమారుల పెళ్లి చేసింది. అటు లక్ష్మి త్వరలోనే తన కొడుకు వివాహం జరిపించాలని నిర్ణయించుకుందని ఆమె భర్త విలపించారు.మల్యాల వైష్ణవి పిల్లలు ఇంటి వద్ద అన్నం తింటుండగా..తల్లి మరణ వార్త విని బోరున విలపించారు.
Similar News
News January 16, 2025
హుస్నాబాద్: కబడ్డీ ‘కోర్టు’ వేసి.. దానిపై ‘చితి’ని పేర్చి..
అక్కన్నపేట మండల చౌటపల్లి గ్రామానికి చెందిన పులికాశి సంపత్ (43) రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, పులికాశి సంపత్ కబడ్డీ క్రీడాకారుడు కావడంతో తోటి క్రీడాకారులు, చౌటపల్లి గ్రామస్థులు కలిసి సంపత్కు చెందిన వ్యవసాయ బావి వద్ద భూమిని చదును చేసి కబడ్డీ ‘కోర్టు’ వేసి దానిపై ‘చితి’ ని పేర్చి దహన సంస్కారాలు నిర్వహించారు. ఇది చూసిన వారు కన్నీరుమున్నీరుగా విలపించారు.
News January 16, 2025
జగిత్యాల: ఈ ఇందిరాభవన్ గురించి మీకు తెలుసా?
దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ నూతన కార్యాలయం ఇందిరా భవన్ ఈరోజు ప్రారంభించారు. అయితే జగిత్యాల జిల్లా కేంద్రంలో సైతం ఓ ఇందిరా భవన్ ఉంది. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇందిరాగాంధీపై విధేయతకు చిహ్నంగా తన నివాస గృహానికి ఇందిరాభవన్గా నామకరణం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ భవనంలోనే సాదాసీదాగా నిత్యం తన వద్దకు వచ్చే ప్రజలకు ఆయన అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు.
News January 16, 2025
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ ముస్తాబాద్ మండలంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల కోలాహలం. @ ఇబ్రహీంపట్నం మండలంలో అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి. @ వేములవాడలో ఆర్ఎంపి క్లినిక్ సీజ్. @ బోయిన్పల్లి మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి. @ మెట్పల్లి మండలంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం.