News February 9, 2025

చిరుమల్ల వనదేవతల జాతరకు వేళాయే!

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం చిరుమల్ల గ్రామంలో సమ్మక్క సారక్క జాతరకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. జాతర తేదీలను ప్రకటించింది. జాతర వివరాలిలా.. ఈనెల 11వ తేదీన జాతర ప్రారంభం కానుంది. 12న ఎదురుగుట్ట నుంచి పగిడిద్ద రాజును, 13న ముసలమ్మ గుట్ట నుంచి సమ్మక్క తల్లిని తీసుకొచ్చి కళ్యాణం జరుపుతారు. 14న శంకుపండుగ, 15న చిరుమల్ల నుంచి ముసలమ్మ గుట్టకు సమ్మక్కను తీసుకెళ్లడంతో జాతర ముగుస్తుంది.

Similar News

News February 11, 2025

ఖమ్మం: బంగారు గుడ్డు పెట్టే బాతును చంపకండి: ఎంపీ

image

కేంద్ర బడ్జెట్‌లో తమ తెలంగాణ ప్రజలను ఎందుకు పట్టించుకోలేదని ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురామిరెడ్డి అన్నారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణకు కేటాయింపుల్లో నిర్లక్ష్యం ఎందుకని లోక్ సభలో ప్రశ్నించారు. దక్షిణాది రాష్ట్రాలను పూర్తిగా విస్మరించారని, పన్నుల రూపంలో కేంద్రానికి అధిక ఆదాయం ఇస్తున్నా కేటాయింపులు చేయలేదని తెలిపారు. బంగారు గుడ్డు పెట్టే బాతును చంపకండి అని హితవు పలికారు.

News February 11, 2025

ఖమ్మం: తీన్మార్ మల్లన్నకు థ్యాంక్స్: సుందర్ రాజ్ 

image

ఖమ్మం-వరంగల్-నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్ సోమవారం ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలందరూ తనను గెలిపించాలని ఆయన కోరారు. అదే విధంగా తీన్మార్ మల్లన్న తనకు మద్దతు తెలపడంపై చాలా సంతోషంగా ఉందని, ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, బీసీ జాతీయ అధ్యక్షుడు గజ్జల శ్రీనివాస్ ఉన్నారు.

News February 11, 2025

కొత్తగూడెం: నిర్మానుష్య ప్రదేశంలో గాయాలతో యువతి..?

image

లక్ష్మీదేవిపల్లి మండలం అనిశెట్టిపల్లి జాతీయ ప్రధాన రహదారి పక్కన గల నిర్మానుష్య ప్రదేశంలో ఓ యువతి గాయాలతో పడి ఉందని స్థానికులు తెలిపారు. గుత్తి కోయ యువతిగా స్థానికులు గుర్తించారు. ఆమెపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడి చేసి గాయపరిచారని చెప్పారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆ యువతిని స్థానికుల సమాచారంతో ఎస్ఐ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!