News April 16, 2025

చివరి ఆయకట్టు వరకు నీరు సరఫరా చేయాలి: కలెక్టర్

image

కోనసీమ జిల్లాలో చిట్ట చివరి ఆయకట్టు వరకు పంటలకు పూర్తిస్థాయిలో సాగునీరు సరఫరా చేసేందుకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ మహేశ్ కుమార్ సూచించారు. ఆయన అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద జలవనరులు, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించారు. రబీ సీజన్ పంట సాగుకు రైతులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా సాగునీటిని అందించాలని ఆయన అధికారులకు సూచనలు చేశారు.

Similar News

News April 19, 2025

సిద్దిపేట: ఫోన్ పట్టి టైం వేస్ట్ చేసుకోవద్దు: హరీశ్ రావు

image

విద్యార్థులు వేసవి సెలవుల్లో మొబైల్ ఫోన్ పట్టుకొని టైం వేస్ట్ చేయొద్దని ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు సూచించారు. శనివారం సిద్దిపేటలో ఏర్పాటు చేసిన ‘భద్రంగా ఉండాలి- భవిష్యత్తులో ఎదగాలి’ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సెలవుల్లో పుస్తక పఠనం చేసి తెలియని వాటిని తెలుసుకోవాలని సూచించారు. మొబైల్ ఫోన్లలో గేమ్స్ ఆడుతూ, రీల్స్ చూస్తూ సమయాన్ని వృథా చేసుకుంటే మనకే నష్టమని అన్నారు.

News April 19, 2025

ఇషాంత్ శర్మకు వడదెబ్బ!

image

అహ్మదాబాద్‌లో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ ఇషాంత్ శర్మకు వడదెబ్బ తగిలింది. ఆయన్ను బౌండరీ లైన్ బయటికి తీసుకెళ్లిన GT సిబ్బంది, లిక్విడ్స్ అందించి తడి టవల్స్‌తో సపర్యలు చేశారు. స్టేడియం వద్ద ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటేయడంతో అటు గుజరాత్, ఇటు ఢిల్లీ జట్ల ఆటగాళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్యాటింగ్ చేస్తున్న ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ సైతం ఎండ దెబ్బకు ఇబ్బంది పడ్డారు.

News April 19, 2025

విశాఖ అభివృద్ధే సీఎం లక్ష్యం: మంత్రి డోలా

image

వైసీపీ 5 ఏళ్ల పాలనలో జీవీఎంసీలో జరిగిన అభివృద్ధి శూన్యమని విశాఖ జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి స్వామి అన్నారు. శనివారం ఆయన జీవీఎంసీలో మేయర్‌పై అవిశ్వాసం నెగ్గిన సందర్భంగా కూటమి కార్పొరేటర్లతో కలిసి మాట్లాడారు. వైసీపీ అరాచకాలు అడ్డుకునేందుకే కార్పొరేటర్లు తిరుగుబాటు చేశారని పేర్కొన్నారు. విశాఖను అన్ని విధాల అభివృద్ధి చేయాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యం అన్నారు.

error: Content is protected !!