News March 15, 2025

చెత్తతో పేరుకుపోయిన భద్రాచలం బస్టాండ్..!

image

నిత్యం వేలాదిమంది ప్రయాణికులతో రద్దీగా ఉండే ప్రాంతం భద్రాచలం బస్టాండు. భద్రాద్రి రాముడి దర్శనం కోసం నిత్యం వేలాదిమంది ఈ బస్టాండ్ ద్వారా ప్రయాణాలు సాగిస్తారు. అలాంటి రద్దీ గల బస్టాండ్ ప్రాంగణంలో చెత్త పేరుకుపోయి దుర్వాసనను వెదజల్లుతోంది. సరైన సౌకర్యాలు లేక ప్రజలు, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ప్రాముఖ్యత కలిగిన పుణ్యక్షేత్రం గల బస్టాండును పరిశుభ్రంగా ఉంచాలని స్థానికులు కోరుతున్నారు.

Similar News

News March 16, 2025

రఘునాథపల్లి: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

image

విద్యుత్ షాక్‌తో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన రఘునాథపల్లి మండలం కోడూరు గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మంద జకరయ్య (శేఖర్) అనే వ్యక్తికి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. మరణ వార్త విన్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 16, 2025

పింఛన్‌దారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

image

AP: రాష్ట్రంలో కొందరు వృద్ధులకు వేలిముద్రలు అరిగిపోయి పెన్షన్ల పంపిణీ సమయంలో సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాలకు 1,34,450 అత్యాధునిక స్కానర్లను పంపిణీ చేయనుంది. ఇందులో ఉడాయ్ సాఫ్ట్‌వేర్ అప్డేట్ చేశారు. ఈ పరికరాల సాయంతో వేలిముద్రల సమస్యకు చెక్ పెట్టొచ్చని సర్కార్ భావిస్తోంది.

News March 16, 2025

నరసరావుపేట: రైలు కిందపడి గుర్తు తెలియని మహిళ ఆత్మహత్య

image

నరసరావుపేట టిడ్కో గృహాల సమీపంలోని రైలు పట్టాల వద్ద డోన్ ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి గుర్తు తెలియని మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే ఎస్ఐ శ్రీనివాసరావు నాయక్ తెలిపారు. ఎస్ఐ మాట్లాడుతూ.. మృతురాలు నీలం రంగు డిజైన్ చీర, నీలం రంగు జాకెట్టు ధరించినట్లు చెప్పారు. మృతురాలిని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచినట్లు తెలిపారు. వివరాలు తెలిసిన వారు స్థానిక రైల్వే పోలీసులను 9440438256 సంప్రదించాలన్నారు.

error: Content is protected !!