News March 20, 2025
చెన్నారావుపేట: రెండు రోజుల్లో టెన్త్ పరీక్షలు.. విద్యార్థి మృతి

మరో రెండు రోజుల్లో వార్షిక పరీక్షలకు వెళ్లాల్సిన పదో తరగతి విద్యార్ధి గుండె సంబంధిత వ్యాధితో మృతి చెందిన విషాద ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం జల్లిలో చోటుచేసుకుంది. పింగిలి అశ్వంత్ రెడ్డి నర్సంపేటలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. అస్వస్థతకు గురికాగా ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ అశ్వంత్ బుధవారం మృతి చెందాడు. కొడుకు మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
Similar News
News March 20, 2025
మెదక్: పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

మెదక్ జిల్లా వ్యాప్తంగా రేపటి నుంచి పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి. నేడు హవేలి ఘనపూర్‌లోని సర్దన జిల్లా పరిషత్ హైస్కూల్‌ను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్షకు హాజరై ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ సూచించారు.
News March 20, 2025
KMR: పీజీ మొదటి సెమిస్టర్ ఫలితాల విడుదల

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫిబ్రవరి నెలలో జరిగిన పీజీ ప్రథమ సంవత్సర(రెగ్యులర్) ఫలితాలను తెలంగాణ యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రో.సంపత్ కుమార్, కళాశాల ప్రిన్సిపల్ కె. విజయ్ కుమార్ విడుదల చేశారు. ఈ పరీక్షలలో 75 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని కళాశాల కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డా.కిష్టయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో TU అడిషనల్ కంట్రోలర్ సంపత్ అధికారులు ఉన్నారు.
News March 20, 2025
ఉయ్యూరులో ఒకరిపై పోక్సో కేసు నమోదు

కృష్ణాజిల్లాలోని ఉయ్యూరులో ఒకరిపై పోక్సో కేసు నమోదైంది. గురువారం ఎస్‌ఐ విశ్వనాధ్ వివరాల మేరకు.. ఉయ్యూరు ఎస్సీ కాలనీకి చెందిన బాలికపై అదే కాలనీలో నివావసముంటున్న చందు బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. చికిత్స నిమిత్తం బాలికను ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఆయన పేర్కొన్నారు.