News June 21, 2024
చెన్నైలోని ఐఐటీలో సీటు సాధించిన పేదింటి విద్యార్థిని
చివ్వెంల మండల కేంద్రానికి చెందిన విద్యార్థిని గుగులోత్ భాగ్య శ్రీ ఐఐటి చెన్నైలో సీటు సాధించింది. 2022లో భాగ్యశ్రీ స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీటు సాధించింది. పేద కుటుంబంలో పుట్టి కష్ట పడి చదివి విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు భాగ్యశ్రీని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఉన్నత విద్యలు అభ్యసించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.
Similar News
News January 3, 2025
నల్గొండ: రిజర్వాయర్‌లో మహిళ మృతదేహం
పెద్దదేవులపల్లి రిజర్వాయర్ అవుట్ పాల్ వద్ద గుర్తుతెలియని మహిళ మృతదేహం కొట్టుకొచ్చినట్లు మాడుగులపల్లి ఎస్ఐ కృష్ణయ్య తెలిపారు. వర్క్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ మాడుగులపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఎస్సై చెప్పారు. నీటిలో పడి రెండు, మూడు రోజులు అయ్యుండొచ్చని ఎస్సై అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీకి తరలించారు.
News January 3, 2025
భువనగిరి కలెక్టరేట్‌కు నామినేషన్ పత్రాలు
త్వరలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ పత్రాలు భువనగిరి కలెక్టరేట్‌కు చేరుకున్నాయి. కాగా ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఓటర్ల తుది జాబితా ప్రకటించామని ఏ క్షణంలోనైనా ఎన్నికలకు వెళ్లే పరిస్థితి ఉండడంతో దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కాగా ఎన్నికలకు 12 మంది నోడల్ అధికారులను నియమిస్తూ జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు.
News January 2, 2025
జిల్లాను మొదటి స్థానంలో నిలిపారు: త్రిపాఠి
జిల్లాలో సమర్థవంతులైన బాధ్యత కలిగిన అధికారులు, సిబ్బంది ఉన్నారని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో నూతన సంవత్సర సందర్భంగా జిల్లా అధికారులు, సిబ్బంది కలెక్టర్‌ను గురువారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గత సంవత్సరం ధాన్యం సేకరణ, ఇందిరమ్మ ఇళ్లు, సమగ్ర కుటుంబ సర్వే వంటి అంశాలలో జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని ఇందుకు కృషి చేసిన మండల ప్రత్యేక అధికారులు,అధికారులను అభినందించారు.