News April 28, 2024

చేవెళ్ల లోక్‌సభ స్థానంలో డబుల్ పేర్లతో గుబులు!

image

డబుల్‌ పేర్లు ప్రధాన పార్టీ అభ్యర్థులకు గుబులు రేపుతున్నాయి. చేవెళ్ల మండలం ధర్మసాగర్‌కు చెందిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. AIFB నుంచి కర్మన్‌ఘాట్‌కు చెందిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి నామినేషన్‌ వేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా గడ్డం రంజిత్ రెడ్డి నామినేషన్‌ వేయగా.. ఇదే పేరుతో దుండిగల్‌కు చెందిన రంజిత్‌రెడ్డి గాదె రెవెల్యూషనరీ సోషలిస్టు పార్టీ నుంచి నామినేషన్ వేశారు.

Similar News

News October 2, 2024

HYD: పండగల తేదీలు ఫిక్స్ చేసిన ‘శ్వాస్’

image

సనాతన ధర్మ వ్యాప్తికి, సమాజ శ్రేయస్సు దృష్ట్యా పండగలు విశేష పర్వదినాల తేదీలను సిద్ధం చేశారు. ప్రజలు ఎలాంటి గందరగోళానికి గురికాకుండా ఉండేందుకు రాబోయే ‘విశ్వావసు నామ సంవత్సరం-2025-26’లో పండుగల తేదీలను నిర్ణయించినట్లు శ్రీ వైష్ణవ ఆగమ సంప్రదాయ సేవా సమితి (శ్వాస్) ప్రకటించింది. నిర్ణయించిన పండగల తేదీలను రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు అందజేస్తామని శ్వాస్ తెలిపింది.

News October 2, 2024

HYD: బైకు దొంగలొస్తున్నారు జాగ్రత్త!

image

HYDలో బైకులు ఎత్తుకుపోతున్నట్లు నిత్యం కేసులు నమోదవుతున్నాయి. కాగా ఘరానా దొంగలే కాకుండా జల్సాలకు అలవాటు పడ్డ కొందరు యువకులు ఈ చోరీలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కారు. ఉప్పల్, అంబర్‌పేట, ఆర్టీసీ క్రాస్‌రోడ్, ఖైరతాబాద్, సోమాజిగూడ, అఫ్జల్‌గంజ్‌, ఇబ్రహీంపట్నం, ఆదిభట్ల, యాచారం, మంచాల ఇళ్ల ముందు బైకులు ఎత్తుకెళ్లి అమ్మేస్తున్నారు. పండగలకు ఊర్లకు వెళ్లేవారు జాగ్రత్త వహించాలని పోలీసులు సూచిస్తున్నారు.

News October 1, 2024

HYD: ‘దళితుడిని వీసీగా నియమించాలి’

image

తెలుగు విశ్వవిద్యాలయానికి ఇంతవరకు దళితుడిని వీసీగా నియమించలేదని మంగళవారం దళిత బహుజన సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. HYDలో మాట్లాడుతూ.. బీసీ, ఓసీ, బ్రాహ్మణులు వీసీలుగా పనిచేసిన తెలుగు విశ్వవిద్యాలయానికి ఇప్పుడు తమ బహుజనులను నియమించాలని సీఎంను కోరారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఉద్యమ నాయకుడు ఆచార్య బన్న అయిలయ్యను వీసీగా నియమించాలని ఈ సందర్భంగా సూచించారు.