News April 14, 2025

చొప్పదండి: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

image

చొప్పదండి పట్టణం బీసీ కాలనీకి చెందిన గాజుల కనకలక్ష్మి (55) శనివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు ఎస్సై మామిడాల సురేందర్ తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులు తమ తల్లిని చంపి మెడలో ఉన్న రెండు తులాల బంగారు పుస్తెలతాడు ఎత్తుకుపోయారని కూతురు నాగమణి ఫిర్యాదు చేసిందని పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.

Similar News

News April 17, 2025

కరీంనగర్ జిల్లాలో ఎండ తీవ్రత ఇలా..

image

కరీంనగర్ జిల్లాలో ఎండ తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో అత్యధికంగా గంగాధర మండలంలో 41.0°C నమోదు కాగా, రామడుగు 40.9, జమ్మికుంట 40.8, మానకొండూర్ 40.7, చిగురుమామిడి, తిమ్మాపూర్ 40.3, చొప్పదండి, కరీంనగర్ రూరల్ 40.2, కరీంనగర్, గన్నేరువరం 40.0, శంకరపట్నం, కొత్తపల్లి 39.9, వీణవంక 39.3, హుజూరాబాద్ 38.7, ఇల్లందకుంట 38.6, సైదాపూర్ 38.1°C గా నమోదైంది.

News April 17, 2025

KNR: భూభారతి రెవెన్యూ చట్టంపై అవగాహన సదస్సులు

image

భూభారతి నూతన రెవెన్యూ చట్టంపై ప్రజలకు ఈనెల 17 నుంచి 30వ తేదీ వరకు కరీంనగర్ జిల్లాలోని అన్ని మండలాల్లో అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు.17న తిమ్మాపూర్, గన్నేరువరం, 19న హుజురాబాద్, 22న రామడుగు, గంగాధర, 23న చొప్పదండి, 24న మానకొండూర్, శంకరపట్నం, 25న జమ్మికుంట, ఇల్లందకుంట, 26న కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, 29న చిగురుమామిడి, సైదాపూర్, 30న వీణవంక మండలాల్లో సదస్సులు నిర్వహించనున్నారు.

News April 17, 2025

ఇల్లందకుంట జాతర బ్రహ్మోత్సవాల హుండీ లెక్కింపు

image

ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నిన్నటితో ముగిసాయని ఈఓ సుధాకర్ తెలిపారు. బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 4 నుండి 16 ఏప్రిల్ వరకు వైభోపేతంగా నిర్వహించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు సమర్పించిన కానుకల హుండీలను దేవాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో 22 ఏప్రిల్ 2025న ఉదయం 9గంటలకు లెక్కించనున్నట్లు తెలిపారు. హుండీ లెక్కింపులో పాల్గొనే భక్తులు డ్రెస్ కోడ్‌లో రావాలని సూచించారు.

error: Content is protected !!