News April 3, 2025
చోడవరం: చెట్టు పైనుంచి జారిపడి మృతి

చోడవరం మండలం నరసయ్యపేట గ్రామ శివారు ప్రాంతంలో బుధవారం సాయంత్రం కల్లు తీయటానికి తాటి చెట్టు ఎక్కిన కల్లుగీత కార్మికుడు మేడిశెట్టి నూకరాజు (30) ప్రమాదవశాత్తు జారిపడిపోయాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నూకరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. అటుగా వెళుతున్న రైతులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చోడవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News April 4, 2025
BIG ALERT: పిడుగులతో కూడిన భారీ వర్షాలు

AP: రాష్ట్రంలో 3 రోజులపాటు విభిన్న వాతావరణం కొనసాగుతుందని APSDMA వెల్లడించింది. ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల రేపు, ఎల్లుండి పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఎల్లుండి కాకినాడలో మోస్తరు వానలు, సోమవారం అల్లూరి, కాకినాడ, తూ.గో, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందంది. మిగతా జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
News April 4, 2025
రాజేంద్రనగర్: గృహప్రవేశంలో పాల్గొన్న సీఎం రేవంత్

రాజేంద్రనగర్‌లో ఇవాళ జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మధుసూదన్ రెడ్డి సోదరుడు ఎలిగంటి వెంకట్‌రెడ్డి గృహప్రవేశ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు. సీఎంను మధుసూదన్ రెడ్డి కుటుంబ సభ్యులు శాలువాతో సన్మానించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, పలువురు నాయకులు ఉన్నారు.
News April 4, 2025
KMR: ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి: కలెక్టర్

కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పౌర సరఫరాలు, సహకార శాఖ అధికారులు, వ్యవసాయం, మార్కెటింగ్, గ్రామీణ అభివృద్ధి అధికారులతో కలెక్టర్ ఆశిష్ సాంగ్వ న్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 446 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా ఇప్పటి వరకు 33 కేంద్రాలు ప్రారంభించినట్లు తెలిపారు. మిగతా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.