News February 11, 2025
ఛాంపియన్గా కర్నూలు జిల్లా జట్టు

యోగ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో రెండు రోజులుగా పెద్దపాడులోని ఓ పాఠశాల నందు నిర్వహిస్తున్న 1వ రాష్ట్ర స్థాయి యోగా లీగ్ పోటీలు సోమవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి కేఎంసీ డిప్యూటీ మేయర్ రేణుక ముఖ్య అతిథిగా హాజరై గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులను అందించారు. కర్నూలు, అనంతపూర్, నంద్యాల జిల్లా జట్లు వరుసగా మూడు స్థానాలలో నిలిచాయి.
Similar News
News May 7, 2025
విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి: కర్నూలు కలెక్టర్

విద్యార్థులు తాము ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆకాంక్షించారు. శనివారం కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో పదవ తరగతి పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను కలెక్టర్ ఘనంగా సత్కరించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువును అభ్యసించినప్పుడే మంచి స్థాయిలో నిలుస్తారని అన్నారు.
News May 7, 2025
అవయవ దానంతో పునర్జన్మను ఇవ్వొచ్చు: కలెక్టర్

అవయవదానం మానవతా కోణంతో చేసే ఒక గొప్ప పనని, అవయవ దానంతో మరొక వ్యక్తికి పునర్జన్మను ఇవ్వొచ్చని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు. శనివారం ఓ హాస్పిటల్లో అవయవ దానంపై నిర్వహించిన అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. అవయవదానం కేవలం దానం కాదు, కొన్ని జీవితాల్లో వెలుగులు నింపే ఆచరణని తెలిపారు. అనంతరం వైద్యులను కలెక్టర్ సన్మానించారు.
News May 7, 2025
హాలహర్విలో వైసీపీ నాయకుడి హత్య

హాలహర్వి మండలం అమృతాపురం గ్రామానికి చెందిన వైసీపీ నేత వెంకటేశ్(55) హత్యకు గురయ్యాడు. శుక్రవారం ఉదయం పొలం పనులకు వెళ్లిన ఆయన సాయంత్రం మృతదేహమై కనిపించాడు. కుటుంబీకుల సమాచారంతో సీఐ రవిశంకర్ రెడ్డి, పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.