News May 16, 2024
జంగా కృష్ణమూర్తిపై అర్ధరాత్రి వేటు.. గతంలోనే ఆ పదవి నుంచి తొలగింపు

ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అర్ధరాత్రి అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. కాగా, ఈయన శాసనమండలిలో విప్‌గా పని చేశారు. ఈ సమయలో వైసీపీపై విమర్శలు చేస్తూ.. తన అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేసిన కొంతకాలానికే ఆయన్ను విప్ పదవి నుంచి తొలగించారు. అనంతరం ఆయన టీడీపీలో చేరారు. ఈ క్రమంలో కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేయాలని లేళ్ల అప్పిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై తాజా నిర్ణయం వెలువడింది.
Similar News
News April 23, 2025
ANU: ఇంజినీరింగ్ మొదటి సెమిస్టర్ ఫలితాలు విడుదల

నాగార్జున వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన మొదటి సెమిస్టర్ 1/4 ఫలితాలను వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు మంగళవారం విడుదల చేశారు. ఎంబీఏ,ఇంటర్నేషనల్ బిజినెస్ స్టడీస్ రీవాల్యూయేషన్ ఫలితాలను కూడా విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. బీటెక్ 4/1, 4/4 సెమిస్టర్ల పరీక్ష ఫలితాలను బుధవారం విడుదల చేసేందుకు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఫలితాలు www.anu.ac.in లో అందుబాటులో ఉన్నాయన్నారు.
News April 23, 2025
గుంటూరు డాక్టర్ అరుదైన రికార్డు

NTR హెల్త్ యూనివర్సిటీ విడుదల చేసిన ఫలితాల్లో గుంటూరు GGH న్యూరాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ గాజుల రామకృష్ణ కార్డియాలజీలో సూపర్ స్పెషాలిటీ పీజీ పూర్తి చేశారు. జనరల్ మెడిసిన్, పల్మనరీ మెడిసిన్, న్యూరాలజీతో పాటు కార్డియాలజీ పీజీలు పూర్తిచేసిన ప్రపంచంలోనే తొలి డాక్టరుగా అరుదైన గౌరవం పొందారు. వేమూరు(M) చావలికి చెందిన రామకృష్ణ గుంటూరులో విద్యాభ్యాసం పూర్తిచేసి, ప్రభుత్వ వైద్య సేవల్లో అనేక బాధ్యతలు చేపట్టారు
News April 23, 2025
గుంటూరు: టెన్త్ ఫలితాల కోసం ఎదురు చూపులు..!

గుంటూరు జిల్లాలో 30,410 మంది టెన్త్ విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 29,459 మంది రెగ్యులర్ స్టూడెంట్స్ కాగా, 2024లో పరీక్షలు తప్పినవారు, ప్రవేట్‌గా రాస్తున్న వారు 961 మంది ఉన్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు SSC పరీక్షల ఫలితాలు విడుదల కానున్నట్లు పరీక్షల విభాగ డైరెక్టర్ KV శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. వే2న్యూస్ ద్వారా వేగంగా పరీక్షల ఫలితాలు తెలుసుకోవచ్చు.