News March 22, 2025

జగన్ అభిప్రాయం అదిములపు సురేష్ ద్వారా చెప్పించారా?: మందకృష్ణ మాదిగ

image

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను సామాజిక న్యాయంగా చూస్తున్నారా, దళితుల మధ్య చిచ్చుగా చూస్తున్నారా అనేది వైసీపీ అధినేత జగన్ స్పష్టత ఇవ్వాలని మందకృష్ణ మాదిగ అన్నారు. గుంటూరులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్గీకరణ గురించి జగన్ సమర్థిస్తున్నారా, లేక వ్యతిరేకిస్తున్నారా? జగన్ అభిప్రాయం అదిమూలపు సురేష్ ద్వారా చెప్పించారా? అనేది జగన్మోహన్ రెడ్డి స్పష్టత ఇవ్వాలని మందకృష్ణ కోరారు.

Similar News

News March 25, 2025

GNT: విడదల రజనిని అరెస్ట్ చేస్తారా..?

image

చిలకలూరిపేటకు చెందిన మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు విడుదల రజని అరెస్టు కానున్నారా? అనే విషయంపై పొలిటికల్ సర్కిల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి రూ.2 కోట్ల నగదు అక్రమంగా వసూలు చేసినట్లు ఇప్పటికే ఆమెపై కేసు నమోదు అయింది. ఎంపీ కృష్ణదేవరాయలు, ప్రత్తిపాటి పుల్లారావు, మర్రి రాజశేఖర్ వంటి కీలక నేతలు ఆమెపై వరుస పెట్టి ఆరోపణలు చేస్తుండటం ఈ వాదనకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.

News March 25, 2025

తాడేపల్లిలో వివాహిత దారుణ హత్య (అప్డేట్)

image

తాడేపల్లిలో ఆదివారం రాత్రి నిర్మానుష్య ప్రాంతంలో వివాహిత దారుణ హత్యకు గురైన విషయం తెలిసినదే. మృతురాలు కృష్ణాజిల్లా పామర్రుకు చెందిన సజ్జా లక్ష్మీ తిరుపతమ్మగా పోలీసులు గుర్తించారు. లక్ష్మీ తిరుపతమ్మతో సన్నిహితంగా ఉండే బిహార్‌కు చెందిన కార్మికులు హత్య చేసినట్లు ఆమె సోదరుడు ఆరోపించాడు. పోలీసులు లక్ష్మీ తిరుపతమ్మ స్నేహితురాలిని, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

News March 25, 2025

మంగళగిరి: ప్రజా క్షేత్రంలో కనిపించని ఆర్కే

image

మంగళగిరి మాజీ ఎమ్మెల్యే YCP నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి (RK) 10 ఏళ్ల పాటు నియోజకవర్గ ఎమ్మెల్యేగా పని చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి RK నియోజకవర్గంలో అందుబాటులో లేరు. కనీసం కార్యకర్తలకు, అనుచరులకు సైతం కనిపించకపోవడం వారిని నిరుత్సాహానికి గురి చేస్తోంది. చివరి ఎన్నికల్లో YCP తరపున పోటీ చేసిన మురుగుడు లావణ్య, కాండ్రు కమల ప్రజా క్షేత్రంలో కనిపించకపోవడం గమనార్హం.

error: Content is protected !!