News June 22, 2024

జగన్ ఇంటి పై ఎటువంటి దాడి జరగలేదు

image

కడప జిల్లా పర్యటనకు వచ్చిన మాజీ సీఎం వైఎస్ జగన్ ను చూసేందుకు పులివెందులలోని ఆయన క్యాంప్ ఆఫీస్ కు కార్యకర్తలు, నాయకులు పోటెత్తారు. జగన్ వచ్చిన వెంటనే ఆయనతో కరచాలనం చేసి మాట్లాడేందుకు కొంత మంది యువకులు ఒక్కసారిగా పోటీపడ్డారు. జగన్ ను కలిసేందుకు తోసుకోగా పక్కనే ఉన్న కిటికీపై పడటంతో కిటికీ అద్దం పగిలి, ఓ యువకుడికి చేతికి కూడా గాయమైంది. ఇంటిపై దాడి అని వచ్చిన కథనాలను వైసీపీ నాయకులు ఖండించారు.

Similar News

News October 5, 2024

ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీకి 6 నుంచి దసరా సెలవులు

image

రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ పరిధిలో ఉన్న ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు ఈనెల 6 నుంచి 13 వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు, ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్ ఆచార్య అమరేంద్ర కుమార్ శనివారం తెలిపారు. తిరిగి క్లాసులు ఈనెల 14 నుంచి పునః ప్రారంభమవుతాయని చెప్పారు.

News October 5, 2024

కడప: ‘మా కుమార్తెను కువైట్‌లో అమ్మేయాలని చూస్తున్నాడు’

image

మత మార్పిడితో ఓ వ్యక్తి వివాహం చేసుకున్న ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కడపకు చెందిన భూషణ్ రెడ్డి కుమార్తెను ఓ వ్యక్తి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడని శుక్రవారం కేంద్ర మంత్రి శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేశారు. ఇంట్లో వాళ్లు రూ.4.8 లక్షల నగదు, 26 తులాల బంగారం తీసుకెళ్లారని, పాస్ పోర్ట్‌కు దరఖాస్తు చేశారని తన కుమార్తెను సౌదీలో అమ్మేస్తాడేమోనని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.

News October 5, 2024

కడప జిల్లాలో తహశీల్దార్ల బదిలీలు

image

కడప జిల్లా వ్యాప్తంగా పలువురు ఎమ్మార్వోలను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ శివ శంకర్ ఆదేశాలు ఇచ్చారు. జిల్లాలోని పలు ప్రాంతాలలో ఉన్న ఎమ్మార్వోలకు స్థానచలనం కల్పిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే సంబంధిత ప్రదేశాలలో రిపోర్ట్ చేసుకోవాలని కలెక్టర్ ఉత్తర్వులో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను, ప్రజలకు మరింత చేరువ చేయాలన్నారు.