News July 2, 2024

జగన్‌ ఫొటోపై ఉదయగిరి MLA ఆగ్రహం

image

ఓ ప్రభుత్వ భవనంపై మాజీ CM జగన్ ఫొటో ఇంకా ఉంచడంపై టీడీపీ MLA ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ విజమూరు మండలం గుండెమడకల గ్రామంలో పింఛన్ల పంపిణీకి వెళ్లారు. స్థానికంగా ఉన్న హెల్త్ కేర్ సెంటర్ భవనం వద్ద జగన్ ఫొటో కనపడింది. దీంతో ఆయన మెడికల్ ఆఫీసర్‌‌కు కాల్ చేశారు. ‘ఏంటి సార్ ఇంకా ప్రభుత్వం మారలేదా? మీకు తెలియదా?’ అని అసహనం వ్యక్తం చేశారు.

Similar News

News January 19, 2025

నెల్లూరు: పెరుగుతున్న నిమ్మ ధరలు.. రైతుల్లో ఆనందం

image

రెండు రోజుల నుంచి నిమ్మ ధరలు ఊపందుకున్నాయి. ఇటీవల చలి ప్రభావం ఎక్కువ ఉండడంతో ధరలు ఆశించినంతగా లేక రైతులు ఆందోళన చెందారు. గూడూరు మార్కెట్లో కిలో నిమ్మకాయలు రూ. 25 నుంచి రూ. 35 వరకు పలుకుతున్నాయి. నాణ్యత కలిగిన నిమ్మకాయలు రూ. 45 పలుకుతున్నట్లు రైతులు చెబుతున్నారు. 50 కేజీల లూజు బస్తా రూ. 2,400 నుంచి 3,300 వరకు అమ్ముతున్నారు. నిమ్మ ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

News January 19, 2025

సూళ్లూరుపేట: పర్యాటకులకు ఉచిత బస్సు సౌకర్యం

image

ఫ్లెమింగో ఫెస్టివల్‌కు వచ్చే పర్యాటకుల కోసం సూళ్లూరుపేట నుంచి ఆది, సోమవారాల్లో (19,20 తేదీలు) అటకానితిప్ప, నేలపట్టు, బీవీ పాలెం పర్యాటక ప్రాంతాలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినట్లు జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ తెలిపారు. ఇందుకోసం 10 బస్సులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పర్యాటకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

News January 18, 2025

నెల్లూరు నగరంలో భారీ ర్యాలీ

image

ప్రజలందరి భాగస్వామ్యంతో స్వచ్ఛ ఆంధ్ర సాకారం అవుతుందని నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు నెల్లూరు నగరంలో వీఆర్సీ నుంచి గాంధీ బొమ్మ వరకు ర్యాలీ నిర్వహించారు, గాంధీ బొమ్మకు పూలమాలవేసి నివాళులర్పించారు. జిల్లాలో 722 గ్రామ పంచాయతీలతో పాటు, మున్సిపాలిటీలలో కూడా స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.