News March 13, 2025

జగన్ మానసిక పరిస్థితి సరిగా లేదేమో..?: స్వామి

image

జగన్ పెట్టిన బకాయిలకు ఆయనే ధర్నాలకు పిలుపునివ్వడం విడ్డూరంగా ఉందని మంత్రి స్వామి విమర్శించారు. ‘ఫీజు రీయింబర్స్‌మెంట్ రూ.4,271 కోట్ల బకాయి పెట్టింది జగన్ కాదా? ఆయన మానసిక పరిస్థితి సరిగా లేదని చెప్పడానికి.. ఇలా ధర్నాకు పిలుపు ఇవ్వడమే నిదర్శనం. వైసీపీ హయాంలో ప్రతిపక్షాలకు నిరసన తెలిపే హక్కు కూడా లేదు. మేము ప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తుండటంతో ధర్నాలు చేసుకుంటున్నారు’ అని మంత్రి అన్నారు.

Similar News

News March 14, 2025

కనిగిరిలో యువకుడి ఆత్మహత్య

image

ప్రకాశం జిల్లాలో పల్నాడు జిల్లా యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తాళ్లూరు మండలానికి చెందిన ఓ మహిళ భర్త చనిపోయాడు. దీంతో ఆమె కనిగిరిలోని పుట్టింటికి వచ్చింది. ఆమెకు సత్తెనపల్లికి చెందిన రవితేజ(28) పరిచయమమ్యాడు. ‘నిన్నే పెళ్లి చేసుకుంటా. మీ అమ్మానాన్నతో మాట్లాడతా’ అంటూ రవితేజ కనిగిరికి వచ్చాడు. ఆమె వద్దని చెప్పడంతో వెళ్లి ఫుల్‌గా మద్యం తాగాడు. మరోసారి ఆమె ఇంటికి వచ్చి చేయి కోసుకోవడంతో చనిపోయాడు.

News March 14, 2025

ప్రకాశం: మరో అధికారి సస్పెండ్

image

ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండల కేంద్రంలోని ఓ భూమి విషయంలో జరిగింది. ఇందులో సర్వేయర్ వెంకటేశ్వర రెడ్డి పాత్రపై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ తమీమ్ అన్సారియా ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇదే స్థల వివాదంలో తహశీల్దార్ బాల కిషోర్, వీఆర్వోను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో సస్పెండ్ అయిన అధికారుల సంఖ్య 3కి చేరింది.

News March 14, 2025

ఒంగోలు: ఇళ్లు నిర్మించుకునే వారికి గుడ్ న్యూస్

image

రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ లబ్ధిదారుల ఇంటి నిర్మాణానికి ఆర్ధిక తోడ్పాటు కల్పిస్తూ అదనపు సాయంగా రూ.50 వేల నుంచి లక్ష రూపాయలు మంజూరు చేస్తుంది. క్షేత్ర స్థాయిలో గృహ నిర్మాణ లబ్దిదారులకు అవగాహన కల్పిస్తూ త్వరగా ఇల్లు నిర్మించుకునేలా దృష్టి సారించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. గురువారం సంబంధిత శాఖల జిల్లా అధికారులతో కలసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

error: Content is protected !!