News February 4, 2025

జగిత్యాల: SI శ్వేత మృతి బాధాకరం: ఎస్‌పీ

image

JGTL గొల్లపల్లి చిల్వకోడూరు వద్ద కారు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో జగిత్యాల జిల్లా పోలీస్ DCRBలో పనిచేస్తున్న ఎస్ఐ కొక్కుల శ్వేత మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎస్ఐ శ్వేత మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించగా ఆమె కుటుంబ సభ్యులను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎస్ఐ శ్వేత మృతి చాలా బాధాకరమని తెలిపారు. శ్వేత మృతి పట్ల పోలీస్ అధికారులు సంతాపం తెలియజేశారు.

Similar News

News February 4, 2025

వెబ్‌సైట్ నుంచి కుటుంబ సర్వే ఔట్.. KTR సెటైర్లు

image

అధికారిక వెబ్‌సైట్‌లోని ‘కుటుంబ సర్వే’ తప్పుల తడకగా ఉందని అసెంబ్లీలో మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు చేయడంతో ప్రభుత్వం ఆ PDFను డిలీట్ చేసినట్లు బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఇది అందుబాటులో లేదని BRS నేత క్రిశాంక్ చేసిన ట్వీట్‌కు కేటీఆర్ రిప్లై ఇచ్చారు. తెలంగాణ సీఎం కార్యాలయాన్ని ట్యాగ్ చేస్తూ.. ‘చాలా బాగా చేశారు. అద్భుతమైన ప్రదర్శన’ అంటూ సెటైర్లు వేశారు.

News February 4, 2025

పాస్‌వర్డ్‌ను ఎవరికీ షేర్ చేయవద్దు: అన్నమయ్య పోలీసులు

image

మీ పాస్‌వర్డ్‌ను ఎవరికీ షేర్ చేయవద్దు, సురక్షిత బ్రౌజింగ్‌ను చేయండని అన్నమయ్య పోలీసులు సూచిస్తున్నారు. ఒక్క అజాగ్రత్త క్లిక్ మీ సమాచారాన్ని బహిర్గతం చేస్తుందన్నారు. మీరు క్లిక్ చేసే ముందు ఆలోచించండి, యాప్‌లు, సాఫ్ట్‌వేర్లను డౌన్‌లోడ్ చేయడం మానుకోండని అవగాహన కల్పించారు. ప్రతి దానిని అనుమానంగా చూడాలన్నారు. మీరు ఏమి పోస్ట్ చేస్తారో అది ఇంటర్నెట్‌లో ఎప్పటికీ అలానే ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

News February 4, 2025

ఫోర్బ్స్ టాప్-10 దేశాల్లో ఇండియాకు నో ప్లేస్

image

ఫోర్బ్స్ ప్రకటించిన టాప్-10 శక్తివంతమైన దేశాల జాబితాలో ఇండియాకు చోటు దక్కలేదు. నాయకత్వం, ఆర్థిక ప్రభావం, రాజకీయ శక్తి, బలమైన విదేశీ సంబంధాలు, సైనిక శక్తి ఆధారంగా ఈ ర్యాంకులు ఇచ్చారు. ఇందులో అమెరికా, చైనా, రష్యా, యూకే, జర్మనీ, సౌత్ కొరియా, ఫ్రాన్స్, జపాన్, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ దేశాలకు టాప్-10లో చోటు దక్కింది. భారత్ 12వ స్థానంలో ఉంది.

error: Content is protected !!