News March 20, 2025
జగిత్యాల: అట్రాసిటీ కేసులను త్వరగా పరిష్కరించాలి: అడిషనల్ కలెక్టర్

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులలో జాప్యం లేకుండా త్వరగా పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం అందించాలని అడిషనల్ కలెక్టర్ బిఎస్.లత అన్నారు. షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జగిత్యాలలో గురువారం నిర్వహించిన డిస్టిక్ లెవెల్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. సమావేశంలో ఆర్డీవోలు మధుసూదన్, జివాకర్ రెడ్డి, శ్రీనివాస్, డిఎస్పీలు రఘుచందర్, రాములు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News March 21, 2025
ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే, ఛైర్మన్

కాజీపేటలోని హజరత్ సయ్యద్ షా అఫ్జల్ బీయబాణి దర్గాలో పీఠాధిపతి ఖుస్రు పాషా ఆధ్వర్యంలో రంజాన్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, కుడా ఛైర్మన్ వెంకటరామిరెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య పాల్గొన్నారు. ఇఫ్తార్ విందు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు.
News March 21, 2025
నల్లమడ: పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

నల్లమడ మండలంలోని ఎనుములవారిపల్లి గ్రామానికి చెందిన చిరంజీవి అనే వ్యక్తికి పోక్సో కేసులో 20 సంవత్సరాల జైలు శిక్ష పడినట్లు శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ రత్న తెలిపారు. 2019 మార్చి 22వ తేదీ కదిరి పోలీస్ స్టేషన్‌లో చిరంజీవిపై పోక్సో కేసు నమోదు అయిందన్నారు. అనంతపురం జిల్లా ప్రత్యేక న్యాయస్థానం నిందితుడిపై విచారణ జరిపి 20 ఏళ్ల జైలు శిక్ష రూ.లక్ష జరిమానా విధించడం జరిగిందన్నారు.
News March 21, 2025
భాగస్వామికి దూరంగా ఉంటున్నారా?

ఒత్తిళ్లో, ఆర్థిక ఒడిదుడుకులో, అనారోగ్యాలో.. కారణాలేవైనా ఎన్నో జంటలు తమ రోజువారీ జీవితంలో దాంపత్య సుఖానికి దూరంగా ఉంటుంటాయి. అది ఏమాత్రం మంచిది కాదని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. దాని వల్ల ఉపయోగం లేకపోగా వారి మధ్య దూరం పెరిగి చికాకులు తోడవుతాయని వివరిస్తున్నారు. ఎన్ని బాధలు ఉన్నా పడకపై భాగస్వామి చెంతచేరి సేదతీరాలని, మరుసటిరోజుకు ఇది కొత్త ఉత్సాహాన్నిస్తుందని సూచిస్తున్నారు.