News February 2, 2025
జగిత్యాల: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం కలిగోట గ్రామానికి చెందిన డిచ్పల్లి పెద్ద గంగారం (48) అనే రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. రైతు సాగుతో పాటు గొర్రెల కాపరిగా పనిచేస్తారు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో పెద్ద గంగారాం శనివారం రాత్రి గ్రామశివారులోని అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నవీన్ కుమార్ పేర్కొన్నారు.
Similar News
News February 2, 2025
హుజురాబాద్: చెరువు కుంటలో ఈతకు వెళ్లి బాలుడి మృతి
హుజురాబాద్ మండలం కందుగుల గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఐదుగురు స్నేహితులతో కలిసి చెరువు కుంటలో ఈతకు వెళ్లి వెంకట సాయి అనే 6వ తరగతి విద్యార్థి మృతి చెందాడు. వెంకటసాయి మృతి చెందడంతో కందుగుల గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై హుజు రాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
News February 2, 2025
KNR: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్.. ప్రజావాణి రద్దు: కలెక్టర్
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఈనెల 3న నిర్వహించే ప్రజా వాణి కార్యక్రమం రద్దు చేయడంతో పాటు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక పూర్తయ్యే వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించమని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఫిర్యాదులు చేయాలనుకునే వారు ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తియిన తర్వాత రావాలని చెప్పారు.
News February 2, 2025
కేంద్ర బడ్జెట్‌పై కరీంనగర్ MP ప్రశంసలు
కేంద్ర బడ్జెట్ 2025-26 కేవలం లెక్కల పద్దు మాత్రమే అని, ఇది ప్రధాని మోదీ దార్శనికత, స్వావలంబన, వృద్ధి, శ్రేయస్సుతో కూడిన వికసిత భారత్‌కు ఒక రోడ్ మ్యాప్ అని కరీంనగర్ MP, కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. రైతు సంక్షేమం, మధ్యతరగతికి ఉపశమనం, మహిళలు, యువతకు సాధికారత కల్పించడం, స్టార్టప్‌లకు ప్రోత్సాహం వంటివి ఈ బడ్జెట్‌లో చూడవచ్చన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడులను ప్రోత్సహించారని వివరించారు.