News November 15, 2024
జగిత్యాల: ఆ ఇంట్లో ఉద్యోగాల పంట!
జగిత్యాల పట్టణానికి చెందిన ఓ ఇంట్లో ఉద్యోగాల పంట పండింది. గ్రూప్-4 ఫలితాల్లో పట్టణానికి చెందిన గుర్రం జయంతి వార్డ్ ఆఫీసర్ ఉద్యోగం సాధించింది. అయితే జయంతి అన్న స్కూల్ అసిస్టెంట్, ఒక సోదరి ఎల్ఐసీ ఏఏవో, మరో సోదరి గురుకుల లైబ్రేరియన్ ఉద్యోగాలు చేస్తున్నారు. కాగా నాన్న రిటైర్డ్ ఉపాధ్యాయులని జయంతి పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యులు తనను ఎంతగానో ప్రోత్సహించారని, వారికి రుణపడి ఉంటానని జయంతి పేర్కొన్నారు.
Similar News
News November 15, 2024
కరీంనగర్: నేడు డయల్ యువర్ ఆర్ఎం
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని ప్రయాణికులకు శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు డయల్ యువర్ ఆర్ఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు RM సుచరిత తెలిపారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని ప్రయాణికులు తెలిపిన సమయంలో తమ సమస్యలను లేదా ఫీడ్ బ్యాక్‌ను 9063403511 నంబర్‌కు ఫోన్ చేసి తెలియజేయాలని సూచించారు.
News November 15, 2024
20న వేములవాడకు సీఎం రేవంత్ రెడ్డి
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరి స్వామి ఆలయానికి ఈనెల 20న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారు. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆలయ మాస్టర్ ప్లాన్ పై అధికారులతో చర్చిస్తారు. అనంతరం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ లో గల్ఫ్ బాధిత కుటుంబాలకు చెక్కులను అందజేస్తారు.
News November 15, 2024
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి: కరీంనగర్ సీపీ
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మోహంతి సూచించారు. గురువారం కరీంనగర్ పోలీస్ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరీంనగర్‌లో యాక్సిడెంట్ జోన్‌లు, బ్లాక్ స్పాట్‌లను గుర్తించాలన్నారు. ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాల్లో ట్రాఫిక్ సిబ్బందిని కేటాయించాలన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ కేసులు, పోక్సో కేసులపై పోలీసు అధికారులతో సమీక్షించారు.