News March 24, 2025
జగిత్యాల: ఆ ప్రాంతంలో MLA ఉప ఎన్నికలు అనివార్యమేనా?

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. రేపు ఈ కేసును ధర్మాసనం విచారించనుంది. ఈ క్రమంలో జగిత్యాలలో BRS నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన సంజయ్ కుమార్‌పై అనర్హత వేటు పడుతుందా.. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. జగిత్యాలలో ఉప ఎన్నికలు జరుగుతాయా అని స్థానికంగా జోరుగా చర్చ నడుస్తోంది. దీనిపై మీ కామెంట్?
Similar News
News March 29, 2025
గాంధారి: వడ్డీ వ్యాపారులపై కేసు

గాంధారి మండలం తిప్పారం గ్రామానికి చెందిన పలువురు వ్యక్తులు అక్రమంగా వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నారని సమాచారం మేరకు శుక్రవారం ఎస్ఐ ఆంజనేయులు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఎలాంటి అనుమతులు లేకుండా వడ్డీ వ్యాపారం చేస్తున్నారని వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు.
News March 29, 2025
వేములవాడ: ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేయుటకు ఇద్దరు గైనకాలజిస్టులు, ముగ్గురు డ్యూటీ డాక్టర్లు గంభీరావుపేటలో ఒక జనరల్ ఫిజీషియన్ పోస్టులకు కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేయుటకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు సూపర్డెంట్ పెంచలయ్య తెలిపారు. వేములవాడ పట్టణంలో శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి గలవారు ఏప్రిల్ 2వ తేదీన కలెక్టరేట్లో జరిగే ఇంటర్వ్యూకి హాజరు కావాలన్నారు.
News March 29, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.