News February 6, 2025

జగిత్యాల ఆర్టీసీ DMను సన్మానించిన MD సజ్జనార్

image

జగిత్యాల ఆర్టీసీ డిపో మేనేజర్ సునీత కొత్త బస్టాండులో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఓ మహిళ ప్రయాణికురాలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్పందించిన డిపో మేనేజర్ ఆ మహిళకు CPR చేసి సమీప ఆసుపత్రికి తరలించారు. ఆమె సేవలకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హైదరాబాద్ బస్ భవన్‌లో డీఎం సునీతను సన్మానించారు. ఈ సందర్భంగా డీఎంను డిపో ఉద్యోగులు అభినందించారు.

Similar News

News February 6, 2025

నిడదవోలు: జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్య 

image

నిడదవోలు చిన్నకాశీరేవులో చాగల్లు మండలం నందిగంపాడు గ్రామానికి చెందిన ఆతుకూరి లింగేశ్వరరావు(44) అనే వ్యక్తి గురువారం ఆత్మహత్యకు పాల్పడినట్లు రైల్వే ఎస్ఐ తెలిపారు. 10 ఏళ్ల నుంచి భార్య తనతో విడిపోయి దూరంగా ఉంటుందనే బాధతో మద్యానికి బానిసై జీవితం మీద విరక్తి చెంది చిన్నకాశీరేవులో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.

News February 6, 2025

కేశంపేట: శివస్వాములకు ముస్లిం సోదరుల అన్నదానం

image

HYD శివారు షాద్‌నగర్ సమీపంలోని కేశంపేట మండలంలోని వేములనర్వ శివాలయంలో శివ స్వాములకు ఎండీ మహమ్మద్ ఆధర్యంలో ముస్లిం సోదరులు అన్నదానం చేశారు. మతసామరస్యం చాటుకున్న సల్వార్, ఆఫీజ్, జహంగీర్‌బాబా, ఇమ్రాన్‌కు శివస్వాములు శ్రీకాంత్, గణేశ్, మహేశ్, భిక్షపతి, అశోక్, బాలరాజు, రాఘవేంద్ర ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

News February 6, 2025

OTTలోకి కొత్త సినిమాలు

image

ఫిబ్రవరి 7 – గేమ్ ఛేంజర్ (AMAZON PRIME)
ఫిబ్రవరి 8 – దేవకీ నందన వాసుదేవ (Disney+ Hotstar)
ఫిబ్రవరి 11- కాదలిక్కా నేరమిల్లై (Netflix)
ఫిబ్రవరి 14 – మార్కో (SonyLIV)
ఫిబ్రవరి 18 – ముఫాసా-ది లయన్ కింగ్ (Disney+ Hotstar)
FEB 22 (అంచనా) – కిచ్చా సుదీప్ ‘MAX’ – ZEE5

error: Content is protected !!