News April 22, 2025

జగిత్యాల: ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 55.00 శాతం

image

ఇంటర్ ఫలితాల్లో జగిత్యాల జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఫస్ట్ ఇయర్‌లో 7,073 మందికి 3.890 మంది పాసయ్యారు. 55.00-శాతం పాస్ పర్సంటేజీ వచ్చింది. సెకండ్ ఇయర్‌లో 6.173 మంది పరీక్షలు రాయగా 4.220 మంది పాసయ్యారు. 68.36 శాతం పాస్ పర్సంటేజీ వచ్చింది.

Similar News

News April 23, 2025

మంచిర్యాల అమ్మాయికి స్టేట్ 2nd Rank

image

ప్రభుత్వం ఇవాళ ప్రకటించిన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో చెన్నూర్ పట్టణానికి చెందిన పబ్బ సంజన సత్తా చాటింది. ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో 470కి 467 మార్కులు రాష్ట్రంలో రెండో ర్యాంక్ సాధించింది. పబ్బ స్రవంతి, సుధాకర్ దంపతుల కూతురు సంజన రాష్ట్రస్థాయిలో ర్యాంక్ సాధించడంపై పలువురు అభినందించారు.

News April 23, 2025

ఉగ్రదాడి వెనుక TRF.. దీని చరిత్ర ఇదే

image

J&K పహల్గామ్‌లో జరిగిన పాశవిక <<16183726>>ఉగ్రదాడి<<>> వెనుక ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(TRF)’ ఉన్నట్లు సమాచారం. ఇది పాక్‌కు చెందిన లష్కర్ ఏ తొయిబాకు అనుబంధ సంస్థ. ఆర్టికల్ 370 రద్దు తర్వాత 2019 AUGలో ఏర్పాటైంది. దీనికి షేక్ సాజిద్ కమాండర్, బాసిత్ అహ్మద్ ఆపరేషనల్ కమాండర్‌గా వ్యవహరిస్తున్నారు. దీన్ని కేంద్రం 2023లో ఉగ్రసంస్థగా ప్రకటించింది. కాగా నిన్న జరిగిన దాడిలో దాదాపు 30 మంది పౌరులు మరణించిన విషయం తెలిసిందే.

News April 23, 2025

HYD: ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: రిటర్నింగ్ అధికారి

image

హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయని రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంతి తెలిపారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో 2 పోలింగ్ కేంద్రాల్లో 112 ఓటర్లకు మంగళవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ నిర్వహిస్తారు. 500 మంది సిబ్బంది, 250 మంది పోలీసులు బందోబస్తు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఎన్నికల కారణంగా జీహెచ్ఎంసీ ఉద్యోగులకు ఏప్రిల్ 23 సెలవు ఇవ్వగా.. జూన్ 14న హాజరుకావాలని సూచించారు.

error: Content is protected !!