News March 27, 2024

జగిత్యాల: ఇనుపరాడ్డుతో తలపై దాడి.. భార్య మృతి

image

జగిత్యాల జిల్లా ఎడపల్లి మండలంలో దారణ ఘటన జరిగింది. మారేడుపల్లి గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ పున్నంరెడ్డి, భార్య రజిత మంగళవారం గొడవపడ్డారు. ఈ నేపథ్యంలో కోపోద్రిక్తుడైన పున్నంరెడ్డి ఇనుప రాడుతో తలపై బలంగా కొట్టగా రజిత అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనా స్థలానికి పెద్దపల్లి సీఐ, బసంత్ నగర్ ఎస్ఐ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గొడవకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 10, 2025

KNR: సీఎంకు బండి సంజయ్ లేఖ

image

సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ రాశారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని లేఖలో పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీ అమలులో రాష్ట్ర ప్రభుత్వం తీరు ‘నోటితో పొగిడి – నొసటితో వెక్కిరించినట్లు ఉందన్నారు. ఆరోగ్య శ్రీ రూ.10లక్షలకు పెంచి ఆచరణకు వచ్చే సరికి అసలు బిల్లులే చెల్లించకుండా నెట్ వర్క్ హాస్పిటల్స్‌ను ఇబ్బందులు పెడుతున్నారని పేర్కొన్నారు.

News January 10, 2025

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి

image

ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురి పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు కనుల పండుగగా జరిగాయి. ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తెల్లవారుజామునే గోదావరి స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రభుత్వ వీపీ లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, ఆలయ ఈఓ శ్రీనివాస్, ఇతర అధికారులు ముక్కోటి ఏకాదశి వేడుకల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

News January 10, 2025

కాల్వ శ్రీరాంపూర్: ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికైన సింధుజ

image

తెలంగాణ టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్ సీల్ ఫలితాలలో కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రానికి చెందిన బంగారి సింధుజ సత్తా చాటింది. గతేడాది జులైలో రాత పరీక్ష జరగగా, అక్టోబర్ నుంచి డిసెంబర్ 23 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరిగింది. ఇందులో భాగంగా బంగారి సింధుజ ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికైంది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.