News February 28, 2025

జగిత్యాల ఎమ్మెల్యే ఆదేశాలు

image

జగిత్యాల అర్బన్ హౌసింగ్ కాలనీ, నుకపల్లి కాలనీలో లబ్ధిదారులకు మంజూరైన డబల్ బెడ్ రూం ఇళ్లకు మౌలిక సదుపాయాలు డ్రైనేజీ లు, ట్రాన్స్ ఫార్మర్ లు, సెప్టిక్ ట్యాంక్, నీళ్ళ వసతి పనులు 10 రోజుల్లో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఆదేశించారు. ప్రజల సహకారంతో పట్టణం అభివృద్ధి చెందుతుందన్నారు.

Similar News

News February 28, 2025

సిద్దిపేటలో MLC  ఓటింగ్ ఇలా..

image

పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు అధికారులు తెలిపారు. సిద్దిపేటలో టీచర్ ఎమ్మెల్సీ ఓటింగ్ 94.83% అంటే ఓటర్లు 3212 ఉండగా 3046 మంది పురుషులు, 1925 మహిళలు 1121 వినియోగించుకున్నారు. అలాగే పట్టబద్రుల ఓటింగ్ 72.83% జరగగా 32589 మంది ఓటర్లకు 23736 మంది పురుషులు 16143, మహిళలు 7593 ఓటు హక్కు వినియోగించుకున్నారని అధికారులు తెలిపారు.

News February 28, 2025

భూపాలపల్లి: బోనస్ నగదు జమకాక రైతులు ఇబ్బందులు

image

రైతులకు వరి ధాన్యం బోనస్ నగదు జమ కాక ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం విక్రయించి 50 రోజులు గడుస్తున్నా నగదు జమ కావట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రూ.2,320 మద్దతు ధరతో పాటు.. క్వింటాకు రూ.500 బోనస్ చెల్లిస్తోందని, జిల్లాలో దాదాపు 81,700 మెట్రిక్ టన్నులు సన్న ధాన్యాన్ని విక్రయించగా రూ.16 కోట్లు మాత్రమే నగదు జమకాగ.. రూ.24 కోట్ల నగదు చెల్లించాల్సి ఉందని అధికారులు తెలిపారు.

News February 28, 2025

రాయపోల్: దీపం అంటుకొని ఇళ్లు దగ్ధం.. రోడ్డున పడిన కుటుంబం

image

విద్యుత్ ప్రమాదంలో పెంకుటిళ్లు దగ్ధమైన ఘటన రాయపోల్ మండలం పెద్దఆరేపల్లిలో రాత్రి చోటుచేసుకుంది. బాధితులు, గ్రామస్థులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన కోంపల్లి శంకరయ్య భార్య లలితతో పాటు శివరాత్రి పండుగ సందర్భంగా రాత్రి ఇంట్లో దేవతలకు దీపం వెలిగించి ఇంటి బయట నిలబడ్డారు. ఈ క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతోఇళ్లు పూర్తిగా కాలిపోయింది. దీంతో ఆ కుటుంబం రోడ్డున పడిందని ఆదుకోవాలని స్థానికులు కోరారు.

error: Content is protected !!