News March 20, 2025
జగిత్యాల: ఎస్సారెస్పీలో తగ్గుతున్న నీటి మట్టం

ఎస్సారెస్పీ ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం 22.564 టీఎంసీలకు చేరింది. యాసంగి పంటల సాగునీరు, తాగునీటి అవసరాలకు కాలువల ద్వారా విడుదల జరుగుతోంది. ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 1,447 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, కాకతీయ కాలువ ద్వారా 5,000, లక్ష్మి కెనాల్ ద్వారా 250, అలీసాగర్ లిఫ్ట్‌కు 540 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రవి తెలిపారు.
Similar News
News March 21, 2025
మా జిల్లాలో రోడ్లు లేవని పిల్లనివ్వట్లే: స్పీకర్

TG: బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రమంతా రోడ్లు వేశామని మాజీ మంత్రి హరీశ్ రావు చెప్పడంపై శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ స్పందించారు. తమ వికారాబాద్ జిల్లాలో రోడ్లు లేక పిల్లనిచ్చే పరిస్థితి కూడా లేదని వ్యాఖ్యానించారు. మరోవైపు రోడ్ల పరిస్థితిపై రాష్ట్రమంతా తిరిగి చూద్దామా అని హరీశ్ రావును మంత్రి కోమటి రెడ్డి ప్రశ్నించారు. మంత్రి విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు హరీశ్ రావు చెప్పారు.
News March 21, 2025
విమానంలో విషాదం: గాల్లోనే పైలోకాలకు..

ఎయిర్ఇండియా విమానంలో విషాదం చోటు చేసుకుంది. గాల్లో ఉండగానే ప్యాసింజర్ అసీఫుల్లా అన్సారీ మృతి చెందారు. దీంతో ఢిల్లీ నుంచి బయల్దేరిన ఫ్లయిట్‌ను గమ్యస్థానంలో కాకుండా లక్నోలో ల్యాండింగ్ చేశారు. సీటుబెల్ట్ పెట్టుకొని చాలాసేపు కళ్లుమూసుకొని కదలకుండా కూర్చోవడంతో సిబ్బంది ఆయన్ను నిద్రలేపేందుకు ప్రయత్నించారు. లేవకపోవడంతో డాక్టర్లను పిలిచారు. ఆయన జర్నీలోనే చనిపోయారని వారు ధ్రువీకరించారు.
News March 21, 2025
గద్వాల: తల్లిదండ్రుల వేధింపులు.. కొడుకు ఆత్మహత్యాయత్నం

తల్లిదండ్రుల వేధిస్తుండటంతో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. ధరూర్ మం. అల్వాల్‌పాడుకు చెందిన గోవర్ధన్‌ను తన తల్లిదండ్రులు వరకట్న విషయమై వేధిస్తుండేవారని తెలుస్తోంది. గోవర్ధన్‌కి రావాల్సిన భాగం ఇవ్వమని, తన భార్యను సైతం వేధిస్తున్నారనే మనస్తాపంతో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు గమనించి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.