News April 4, 2025

జగిత్యాల: కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

image

జగిత్యాల రూరల్ మండలం పోరండ్ల గ్రామంలో గురువారం విద్యుదాఘాతంతో రైతు దేవి చంద్రయ్య(55) మృతి చెందారు. పొలానికి నీరు పెట్టేందుకు వెళ్తుండగా తెగిపడిన విద్యుత్తు తీగ తగిలి అక్కడికక్కడే చనిపోయారు. సమాచారం అందుకున్న జగిత్యాల రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Similar News

News April 5, 2025

గుప్తా నిధులంటూ రూ.4.50లక్షలు కాజేశారు:నిర్మల్ ASP

image

గుప్త నిధులు ఉన్నాయని ఓ వ్యక్తిని నలుగురు దుండగులు నమ్మించి రూ.4,50,000 కాజేసిన ఘటన నిర్మల్ జిల్లా కడెం మండలంలో చోటుచేసుకుంది. శుక్రవారం సాయంత్రం ఈ ఘటనపై నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఏఎస్పీ రాజేష్ మీనా ప్రెస్ మీట్ నిర్వహించారు. అగ్బర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టి 3 నిందితులను పట్టుకొని రిమాండ్‌కి పంపినట్లు తెలిపారు.

News April 5, 2025

మెదక్: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

జాతీయ రహదారిపై స్కూటీని లారీ ఢీకొట్టడంతో ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన రామాయంపేట మండలంలో జరిగింది. ఎస్ఐ బాలరాజు తెలిపిన వివరాలు.. దేవునిపల్లి గ్రామానికి చెందిన సాకేత్ (19) గురువారం రాత్రి తన స్నేహితులతో కలిసి స్కూటీపై వెళ్తుండగా లారీ ఢీకొట్టడంతో సాకేత్ అక్కడికక్కడే మృతి చెందాడు. శుక్రవారం బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 5, 2025

మహబూబ్‌నగర్: BJP నాయకులపై కేసు నమోదు

image

పాఠశాల తరగతులు జరుగుతున్న సమయంలో విధులకు ఆటంకం కలిగించిన BJP నాయకులపై కేసు నమోదు చేసిన ఘటన శుక్రవారం MBNR జిల్లా చిన్నచింతకుంటలో చోటుచేసుకుంది. ఎస్ఐ రామ్‌లాల్ నాయక్ తెలిపిన వివరాలు.. ఉన్నత పాఠశాలలో తరగతులు జరుగుతున్న సమయంలో BJP నాయకులు రమేశ్, శివ మరికొందరు కార్యకర్తలు HM అనుమతి లేకుండా పాఠశాలను విడిపించి విద్యార్థులను తీసుకొని CM దిష్టిబొమ్మ దహనం చేశారని HM మాధవి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు.

error: Content is protected !!