News July 19, 2024

జగిత్యాల: కూలిన చెట్టు.. విరిగిన స్తంభాలు

image

జగిత్యాల జిల్లాలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. గురువారం రాత్రి మేడిపల్లి గ్రామంలో 11 కేవీ లైన్‌పై పెద్ద చెట్టు కూలి 2 స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ దెబ్బతిన్నాయి. దీంతో గ్రామంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. TGNPDCL సిబ్బంది విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.

Similar News

News November 28, 2024

కరీంనగర్: చలికాలం జాగ్రత్త!

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చలి నెమ్మదిగా పంజా విసురుతోంది. చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో చిన్నారులు, వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చలికాలంలో ఆహారం, నీటితో అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, అందుకు మూడు పూటలా వేడి ఆహారంతో పాటు కాచి చల్లార్చిన గోరువెచ్చని నీటిని తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

News November 28, 2024

KNR: వణికిస్తున్న చలి.. గ్రామాల్లో చలి కాగుతున్న యువత

image

చలి తీవ్రత అధికమవడంతో ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. పెరుగుతున్న చలికి గ్రామాల్లో ఉమ్మడి KNR ప్రజలు చలి మంటలు వేసుకుని వెచ్చదనాన్ని ఆస్వాదిస్తున్నారు. ఒకే చోట గుమికూడి చిన్ననాటి గుర్తులను జ్ఞాపకం చేసుకుంటూ చలికాగే రోజులు ప్రస్తుతం కనిపిస్తోంది. గతంలో గ్రామాల్లో ఆరు బయట గడ్డి, టైర్లు, కట్టెల మంట వేసుకొని చలి కాగు సేదతీరే వారు. ఇప్పుడు అదే పరిస్థితి పూర్వకాలం నాటి జ్ఞాపకాలను గుర్తుతెస్తోంది.

News November 28, 2024

స్పెల్లింగ్ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించాలి: మంత్రి ఉత్తం

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని పెండింగ్ ప్రాజెక్టుల విషయమై ప్రత్యేకంగా దృష్టి సారించామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నీటి ప్రాజెక్టుల స్థితిగతులు, పెండింగ్ ప్రాజెక్టులు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, చెల్లింపులు తదితర అంశాలపై ఆయా శాఖల ఉన్నతాధికారులతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం సమీక్ష నిర్వహించగా కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొన్నారు.