News February 17, 2025

జగిత్యాల: కొత్త క్రిమినల్ చట్టాలపై అవగాహన కార్యక్రమం

image

జులై 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త క్రిమినల్ చట్టాలపై పోలీసు అధికారులు, సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని జగిత్యాల జిల్లా అదనపు ఎస్పీ వినోద్ కుమార్ అన్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం కొత్త చట్టాలపై అవగాహన, శిక్షణ నిర్వహించారు. పోలీసు శాఖకు చెందిన డిఎస్పీ నుంచి కానిస్టేబుల్ అధికారులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.

Similar News

News December 23, 2025

పల్నాడు జిల్లాలోని లాడ్జిలో వ్యభిచారం గుట్టురట్టు!

image

నరసరావుపేట రైల్వే స్టేషన్ రోడ్డులోని ఓ లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తుండగా ఎస్ఐ అరుణ తన సిబ్బందితో సోమవారం రాత్రి మెరుపు దాడి చేశారు. ఈ దాడులలో బాపట్ల జిల్లా సంతమాగులూరు చెందిన షేక్ గౌస్ బాజీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కాగా నరసరావుపేటలో వ్యభిచార గృహాలపై పోలీసులు వరుసగా దాడులు చేస్తున్నా పదేపదే వ్యభిచారం నిర్వహిస్తూ మళ్లీమళ్లీ పట్టు బడుతున్నారు.

News December 23, 2025

‘కరెంటోళ్ల జనబాట’ పోస్టర్ ఆవిష్కరణ: JC

image

రాయచోటి కలెక్టరేట్లోని PGRS హాలులో సోమవారం స్పందన అనంతరం నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ సరఫరా లక్ష్యంగా రూపొందించిన ‘కరెంటోళ్ల జనబాట’ పోస్టర్‌ను JC ఆదర్శ రాజేంద్రన్ ఆవిష్కరించారు. ప్రజల విద్యుత్ సమస్యలను ప్రత్యక్షంగా గుర్తించి వెంటనే పరిష్కరించడమే కార్యక్రమం ఉద్దేశమన్నారు. ప్రతి మంగళవారం, శుక్రవారం APSEDCL సిబ్బంది గ్రామాలు, పట్టణ వార్డుల్లో పరిశీలనలు చేపడతారని చెప్పారు.

News December 23, 2025

కృష్ణా: కేక్ ఇస్తానని చెప్పి.. 5ఏళ్ల చిన్నారిపై బాలుడి అత్యాచారం

image

కృష్ణా (D) మొవ్వ మండల పరిధిలోని ఓ గ్రామంలో ఐదేళ్ల చిన్నారిపై 13ఏళ్ల బాలుడు అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ శిరీష వివరాల మేరకు.. ఈ నెల 20వ తేదీ సాయంత్రం 4.30 గంటలకు పాపకు కేక్ ఇస్తానని చెప్పి బాలుడు అత్యాచారం చేశాడు. సోమవారం ఉదయం చిన్నారి కడుపు నొప్పితో బాధపడటంతో తల్లిదండ్రులు ఆసుపత్రిలో చూపించారు. వైద్యులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బాలుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.