News April 5, 2025

జగిత్యాల: జిల్లా సెర్ప్ ఏపీఎంల యూనియన్ నూతన కార్యవర్గం

image

జగిత్యాల జిల్లా కేంద్రంలో సెర్ప్/ఐకేపీ ఎపిఎం ల యూనియన్ సమావేశంలో జగిత్యాల జిల్లా ఎపిఎంల యూనియన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కే.శ్రీనివాసచక్రవర్తి, ఉపాధ్యక్షుడిగా ఏ. శంకర్, ప్రధాన కార్యదర్శిగా పి. నరహరి, సహాయ కార్యదర్శిగా డి. సమత, కోశాధికారిగా వై.రమాదేవి ఎన్నికయ్యారు. అలాగే సలహాదారులుగా ఆర్. చంద్రకళ, జి.సి.రాజయ్య నియమితులయ్యారు.

Similar News

News April 8, 2025

ADB: కత్తిని చూపిస్తూ బెదిరించిన వ్యక్తిపై కేసు నమోదు

image

ఆదిలాబాద్ చించర్‌వాడకు చెందిన తోట విగ్నేష్ రామనవమి శోభాయాత్రలో కత్తిని చూపిస్తూ చంపేస్తానంటూ బెదిరించినందున కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. భారీ ర్యాలీలో నిందితుడు కత్తితో తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని తెలిపారు. కత్తులను చూపిస్తూ బెదిరించి చంపేస్తామంటూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా ఎలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News April 8, 2025

గుండెపోటు ప్రమాదం మహిళలకే ఎక్కువ: అధ్యయనం

image

గుండెపోటు వచ్చే ప్రమాదం పురుషులతో పోలిస్తే మహిళల్లోనే ఎక్కువని అమెరికా పరిశోధకులు చేసిన అధ్యయనంలో తేలింది. ‘మగవారితో పోలిస్తే స్త్రీల ఓవరాల్ హెల్త్ బాగున్నా గుండెపోటు విషయంలో ప్రమాదం వారికే ఎక్కువగా ఉంటోంది. మధుమేహం, బీపీ వంటివి వస్తే పురుషులు తట్టుకున్నంతగా మహిళల దేహాలు తట్టుకోలేకపోతున్నాయి. ప్రెగ్నెన్సీ, మెనోపాజ్ వంటివి దీని వెనుక కారణం కావొచ్చు’ అని పేర్కొన్నారు.

News April 8, 2025

నిజాంసాగర్: స్నానానికి వెళ్లి నీట మునిగి వ్యక్తి మృతి

image

మంజీరా నదిలో స్నానానికి వెళ్లి నీట మునిగి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన నిజాంసాగర్‌లో చోటు చేసుకుంది. ఎస్ఐ శివకుమార్ వివరాలు.. నిజాంసాగర్ మండలం బంజేపల్లికి చెందిన భాగయ్య(48) మంజీరా నదిలో స్నానానికి వెళ్ళాడు. ప్రమాదవశత్తు నీట మునిగి మృతి చెందాడు. మృతదేహం నీటి ఒడ్డున లభ్యమైంది.. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.

error: Content is protected !!