News March 4, 2025
జగిత్యాల జిల్లాలో 28 ఇంటర్ పరీక్ష కేంద్రాలు

జగిత్యాల జిల్లాలో 28 ఇంటర్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఇంటర్ పరీక్షల కన్వీనర్ నారాయణ మంగళవారం తెలిపారు. పరీక్షల నిర్వహణకు కాపీయింగ్ జరగకుండా 2 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను, 4 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు వారి వెంట ఏ విధమైన ప్రింటెడ్ మెటీరియల్, మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాలు, స్మార్ట్, నార్మల్ వాచ్లు, కాలిక్యులేటర్లు తీసుకురావద్దన్నారు.
Similar News
News March 5, 2025
‘లేడీ సూపర్ స్టార్’ అని పిలవొద్దు: నయనతార రిక్వెస్ట్

తనను ‘లేడీ సూపర్ స్టార్’ అని పిలవొద్దని, పేరుతోనే పిలవాలని స్టార్ హీరోయిన్ నయనతార తన ఫ్యాన్స్, మీడియా, సినీ వర్గాలను రిక్వెస్ట్ చేశారు. అభిమానులు అలా పిలవడం తనకు సంతోషంగా ఉన్నా ‘నయనతార’ అనే పేరే తన హృదయానికి దగ్గరైందని చెప్పారు. అది తనకు నటిగానే కాకుండా వ్యక్తిగానూ తనేంటో తెలియజేస్తుందని ఓ ప్రకటన విడుదల చేశారు. బిరుదులు వెలకట్టలేనివని, ఒక్కోసారి అవే మన పని నుంచి దూరం చేసే ఇమేజ్ తెస్తాయన్నారు.
News March 5, 2025
విధులలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు: హనుమకొండ DMHO

హనుమకొండ జిల్లాలోని పలు ప్రభుత్వ హాస్పిటల్స్‌ను DMHO అప్పయ్య మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల వివరాలను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న మందులను.. సద్వినియోగ చేసుకొని రోగులకు ఇబ్బందులు కలవకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. విధులలో వైద్యులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
News March 5, 2025
విశాఖలో టుడే టాప్ న్యూస్

➤ విశాఖలో ఎన్నికల కోడ్ ఎత్తివేత: కలెక్టర్
➤ దివ్యాంగుల పారా స్టేడియం కోసం స్థల పరిశీలన
➤ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ నిర్వహణకు స్టేడియం సిద్ధం
➤ మార్చి 17 నుంచి 134 కేంద్రాలలో పదో తరగతి పరీక్షలు
➤ నేడు విద్యుత్ ప్రధాన కార్యాలయంలో లైన్‌మ్యాన్ దివస్
➤ రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ హోదా కొనసాగేలా చర్యలు