News March 21, 2025

జగిత్యాల జిల్లాలో తగ్గిన ఉష్ణోగ్రతలు

image

జగిత్యాల జిల్లాలో ఎండలు కాస్త తగ్గాయి. గురువారం జైన, జగ్గసాగర్ 38℃ ఉష్ణోగ్రత నమోదైంది. అటు మన్నెగూడెం 37.9, అల్లీపూర్, పెగడపల్లె 37.8, సారంగాపూర్ 37.6, మేడిపల్లె, మల్లాపూర్ 37.5, మారేడుపల్లి 37.4, రాయికల్ 37.1, వెల్గటూర్, జగిత్యాల 37, నేరెల్లా, కొల్వాయి 36.9, ఐలాపూర్ 36.9, గొల్లపల్లె 36.7, సిరికొండ 36.5, గుల్లకోటలో 36.2℃ ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో గురువారం జిల్లాలో కాస్త చల్లటి వాతావరణం నెలకొంది.

Similar News

News March 31, 2025

రాష్ట్రంలో నేటి నుంచి వర్షాలు

image

AP: నేటి నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ తెలిపింది. ఇవాళ మోస్తరు వర్షాలు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురుస్తాయని అంచనా వేసింది. 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఈ వర్షాలతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు TGలో కూడా ఎల్లుండి నుంచి నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

News March 31, 2025

ఆదిలాబాద్: కొత్త సంవత్సరం.. స్థానిక సమరం!

image

స్థానిక సంస్థల ఎన్నికల ఆశావహులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం రాజకీయ భవిష్యత్‌ను తేల్చనుంది. ఆదిలాబాద్ జిల్లాలో త్వరలో సర్పంచ్, వార్డ్ మెంబర్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఈ నూతన సంవత్సరంలో జరగనున్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన రాజకీయ ఆశావహులకు ఈ ఏడాది ‘కీ రోల్’ కాబోతోంది.

News March 31, 2025

పోలీస్ స్టేషన్‌గా మారిన వికారాబాద్ RDO ఆఫీస్

image

పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం పోలీస్ స్టేషన్‌గా కనిపించడంతో ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయాన్ని వెబ్ సిరీస్ షూటింగ్ నిర్వాహకులు పోలీస్ కార్యాలయంగా మార్చారు. ఆదివారం సెలవు ఉండడంతో షూటింగ్‌ కోసం అనుమతి ఇచ్చారు. దీంతో నిర్వాహకులు ఆఫీస్‌ను ఇలా పోలీస్ స్టేషన్‌గా మార్చేశారు.

error: Content is protected !!